ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్‌తో తమన్ పని చేయడం కూడా ఇదే తొలిసారి. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోను తమన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఎన్టీఆర్ కెరీర్లో 28 సినిమా ఇది. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. 'అసామాన్యుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నే ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని తెలుస్తోంది.

యంగ్ టైగర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్ఠీఆర్-పూజా హగ్డే కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. ఇంతకు ముందు ఈ చిత్రానికి అను ఇమ్మాన్యుయేల్ అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో దర్శకుడి నిర్ణయం మారింది.
'జై లవ కుశ' సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాపులో సినిమాలోని పాత్ర కోసం తన బాడీ షేపులు మార్చుకున్నాడు. స్టీవెన్ లాయిడ్ అనే విదేశీ ట్రైనర్ సమక్షంలో ట్రైన్ అయి సరికొత్త స్లిమ్‌లుక్ లోకి మారిపోయాడు. గత సినిమాలకు భిన్నంగా స్లిమ్ లుక్‌తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











