ఎన్టీఆర్ కోసం.. ఒక వైవు బాలీవుడ్ బ్యూటీ మరోవైపు కన్నడ క్యూటీ

టాలీవుడ్ స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకోవడానికి ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ కూడా చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతోంది. బాలీవుడ్ మార్కెట్ కి తగ్గట్లుగానే మన నిర్మాతలు కూడా అడిగినంత ఇస్తున్నారు. అందుకే నార్త్ బ్యూటీలు స్టార్ హీరోల సినిమాలకు చాలా ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ మధ్య కీయరా అద్వానీ డామినేషన్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి.

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత మెల్లగా మెగాపవర్ స్టార్ వినయ విధేయ రామ సినిమాలో మెరిసింది. కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

Jr ntr trivikram upcoming movie heroine discussions started

అయితే ప్రస్తుతం దర్శకుడు నటీనటులను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీ అయ్యాడు. ఇక కీయరా అద్వానీతో పాటు కన్నడ క్యూట్ పిల్ల రష్మీక మందన్న కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేయాలని ఇటీవల దర్శక నిర్మాతలు చర్చలు జరిపినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X