ఎన్టీఆర్ బర్త్ డే: మహేష్ బాబుతో పాటు సెలబ్రిటీల ట్వీట్స్

By Bojja Kumar

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. తమ అభిమాన నటుడు 35వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సెలబ్రేషన్స్ నిర్వహించారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ లక్షలాది సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్... ఇలా ఏది చూసినా అంతా ఎన్టీమయం అయిపోయింది. పలువు సినీ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. మహేష్ బాబు, మోహన్ లాల్, కాజల్, నివేదా థామస్, ప్రణీత ఇలా పలువురు స్టార్స్ యంగ్ టైగర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Recommended Video

Ram Charan Birthday Wishes To NTR Goes Viral

మరిన్ని విజయాలు సాధించాలని మహేష్ బాబు ట్వీట్

ఎన్టీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మోహన్ లాల్

‘జనతా గ్యారేజ్' మూవీ సమయంలో మరింత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు మరింత సన్నిహితుడయ్యాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ పుట్టినరోజును పురస్కరించుకుని హ్యాపీ బర్త్ డే డియర్ అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.

మోస్ట్ ఎనర్జిటిక్ మ్యాడ్ ఫ్రెండ్స్ అంటూ నాని

ఈ రోజు ఎన్టీఆర్‌తో మంచు మనోజ్ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా ఇద్దరినీ విష్ చేస్తూ నాని ట్వీట్ చేశారు. మోస్ట్ ఎనర్జిటిక్ మ్యాడ్ ఫ్రెండ్స్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

కాజల్ అగర్వాల్

ఎన్టీఆర్‌తో కలిసి పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ తన బెస్ట్ కోస్టార్‌ను విష్ చేస్తూ ఇలా ట్వీట్ చేసింది.

లుక్ అదిరిపోయింది అంటూ నివేథా ట్వీట్

జై లవ కుశ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించిన నివేథా థామస్ యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ...... ‘అరవింద సమేత వీర రాఘవ' మూవీ లుక్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

లావణ్య త్రిపాఠి

టాలీవుడ్లోని ఫైనెస్ట్ యాక్టర్లలో ఎన్టీఆర్ ఒకరు అంటూ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ట్వీట్ చేశారు.

ప్రణీత

కన్నడ బ్యూటీ ప్రణీత యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

యాంకర్ ప్రదీప్

హ్యాపీ బర్త్ డే టు రోరింగ్ టైగర్ అంటూ ఫేమస్ టీవీ యాంకర్ ప్రదీప్ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్

‘జై లవ కుశ' మూవీలోని జై పాత్రను గుర్తు చేస్తూ..... ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ యంగ్ టైగర్‌కు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X