»   » రాజమౌళి విన్నావా...ఎన్టీఆర్ ఏమన్నాడో....

రాజమౌళి విన్నావా...ఎన్టీఆర్ ఏమన్నాడో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జనతగ్యారేజ్ సక్సెస్ తో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ కు తొలి రోజుల్లో తొలి హిట్టిచ్చింది మాత్రం రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నం.1... ఎన్టీఆర్ కు తొలి హిట్ వచ్చిన చిత్రం. నిజానికి అంతకుముందే ఓ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయినా పెద్దగా గుర్తింపు రాలేదు.

స్టూడెంట్ నం.1తోనే దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి పరిచయం అయింది. ఆ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటే ట్వీట్స్ పెట్టారు దర్శకుడు రాజమౌళి. ఆయనకు ధాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్.


అలాగే రాజమౌళితో అప్పుడు ప్రారంభమైన తన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందంటూ ఆనందంగా చెప్పారు. ఆ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెలుగు ఇండస్ట్రీ అదిరిపోయే హిట్ సింహాద్రి వచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ యమదొంగ తో వీళ్లిద్దరూ కలిసారు. ఆ సినిమానూ సూపర్ హిట్టే. ఈ నేపద్యంలో ఎన్టీఆర్ కు రాజమౌళి అంటే గౌరవం , ప్రేమ.

ఎన్టీఆర్ తాజా ట్వీట్స్ చూస్తూంటే అది మనకు అర్దమవుతుంది.

rn rn

డెబ్యూ డైరక్టర్ గా మొదలెట్టి...


ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘పదిహేనేళ్ల క్రితం వర్ధమాన దర్శకుడిగా జర్నీ ప్రారంభించిన నా జక్కన్న దేశంలో అత్యంత గౌరవనీయమైన దర్శకులు. ఆయనకు సుదీర్ఘ ప్రయాణం ఉంది'' అని అన్నారు.

rnrn

ఓ కుర్రాడు నుంచి బిడ్డకు తండ్రిగా..

15 సంవత్సరాల జర్ని...19 సంవత్సరాల కుర్రాడినుంచి ఓ బిడ్డకు తండ్రిగా ఎదిగాను...ఈ క్రమం అంతా మెమరబుల్ అన్నారు ఎన్టీఆర్.

rn rnrn

మా స్నేహం మాత్రం అలాగే

15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం , స్టూడెంట్ నెంబర్ వన్ నాటి మా స్నేహం ఇంకా నిలిచే ఉంది అన్నారు ఎన్టీఆర్

rnrn rn

గుర్తు చేసుకునేలా చేసినందుకు ...

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటే ట్వీట్స్ పెట్టారు దర్శకుడు రాజమౌళి. అలా చేసి తనకు ఆ రోజుల్ని గుర్తు చేసినందుకు ఎన్టీఆర్ ధాంక్స్ చెప్పారు.

 నిజానికి అలా అనిపించటం లేదు

నిజానికి అలా అనిపించటం లేదు

దర్శకుడిగా నేను పరిచయమై 15 ఏళ్లు అయ్యింది. నేను ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా చేరి 25 ఏళ్లు అయ్యింది. వినడానికి చాలా కాలంలా ఉంది. కానీ అలా అనిపించడం లేదు అన్నారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 చిత్రం బిజీలో ఉన్నారు. ఈ పదిహేనేళ్లలో ఆయన జాతీయంగానే కాక అంతర్జాతీయంగానూ ఎన్నో ప్రశంసలు పొందారు.

 అదీ వ్యవసాయానికి సంభందించినవి

అదీ వ్యవసాయానికి సంభందించినవి

నాకు, తారక్‌కి స్విట్జర్లాండ్‌లో ఒకే గది ఇచ్చారు. నేను 9 గంటలకల్లా నిద్రపోతాను. అతడు 12 గంటల వరకు టీవీ చూస్తాడు. అది కూడా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు. అక్కడ ప్రసారం అయ్యే ఒకే ఒక్క ఛానల్‌ అది.. స్విస్‌ భాషలో అంటూ అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు రాజమౌళి. ఇప్పటికీ అది గుర్తొస్తే తనని తిట్టుకుంటా.

నా డైరక్షన్ మాత్రం ఎమెచ్యూరిష్ గా..

నా డైరక్షన్ మాత్రం ఎమెచ్యూరిష్ గా..

‘స్టూడెంట్‌ నం.1' విజయం క్రెడిట్‌ని.. కథ రాసిన పృథ్వీతేజకి, సంగీతం సమకూర్చిన కీరవాణికి ఇస్తాను. కొన్ని సన్నివేశాల్లో తారక్‌ చక్కని నటనను చూడొచ్చు. విరామానికి ముందు సన్నివేశంలో తప్ప నా దర్శకత్వం ఎమెచ్యూరిష్‌గా ఉందనిపిస్తుంది.

 హీరోగా స్వీకరించటం మొదలెట్టారు.

హీరోగా స్వీకరించటం మొదలెట్టారు.

మేము విజయయాత్రకు వెళ్లినప్పుడు ప్రజలు తారక్‌ను హీరోగా స్వీకరించడం ప్రారంభించడాన్ని చూశాను. వయసుపైబడినవాళ్లు కూడా ఈ 19 ఏళ్ల కుర్రాడ్ని చూడడానికి గుంపులుగా వచ్చారు. అది ఓ మంచి అనుభవం. ఆ సినిమాలో కొత్తగా పనిచేసిన మాలాంటివాళ్లందరం ఆ అవకాశం పొందినందుకు అదృష్టవంతులం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

వెయిటింగ్

వెయిటింగ్

రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవటం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్లు లేరు. ఎన్టీఆర్ ఎప్పుడైనా తాను జక్కన్న డైరక్షన్ లో చేయటానికి రెడీ అంటూ ఉత్సాహం చూపిస్తున్నారు. మరి ఎప్పుడికి తీరుతుందో.

 నిజమే..సీక్వెల్ తీస్తారా

నిజమే..సీక్వెల్ తీస్తారా

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌-రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన య‌మ‌దొంగ సినిమా అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోబోతందంటూ ఆ మధ్యన ప్రచారం మొదలైంది. ఈ సీక్వెల్ మూవీలో కూడా ఎన్టీఆరే హీరోగా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమాను నిర్మిస్తోంది ఓ టీడీపీ ఎంపీ అని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి బాహుబ‌లి లాంటి హిట్ సినిమాకు కొన‌సాగింపుగా బాహుబలి 2 మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

 గరుడ ఏమైంది

గరుడ ఏమైంది

ఎన్టీఆర్ తో గరుడ అనే 1000 కోట్ల సినిమాను తెరకెక్కించబోతున్నాడని ఆ సినిమా టీసర్ కే సుమారు 25 కోట్ల రూపాయలు అవుతాయని ఆ మధ్యన ఓ ప్రచారం వెబ్ మీడియాలో మొదలైంది. కాని బయట వినిపిస్తున్న ఈ వార్తలన్నీ అబద్దాలే అని రాజమౌళి సన్నిహితులు కన్ఫాం చేసి చెప్పేదాకా ఆగలేదు. ఈ వార్తలన్నీ అబద్దాలే అని అసలు ఇలాంటి ఎవరు పుట్టిస్తున్నారో తెలియదు కాని రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి అంటే మరో రెండేళ్ళు పడుతుందనేది నిజం. అప్పుడు గరుడ చేస్తాడో ఏం సినిమా చేస్తాడో రాజమౌళే స్వయంగా ప్రకటిస్తాడని తెలిపాడు. దాంతో ఈ గరుడ వ్యవహారం ఇప్పటికి ముగిసినట్లే.

 అదీ రూమరేనా లేక

అదీ రూమరేనా లేక

అలాగే రాజమౌళి బాహుబలి 2 తర్వాత మహాభారతం తెరకెక్కించనున్నారని, ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు ఆ మధ్యన వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ సినిమా భారీ ప్రాజెక్టు కావడం బాహుబలి సినిమాను మించిన బడ్జెట్ తో చేసే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కావడంతో దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ ఉంటుందని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శారీరకంగా సన్నద్దం అవ్వాల్సి ఉంటుందని రెండు మూడేళ్ల పాటు ఇతర సినిమాలు చేయకుండా కేవలం ఇదే ప్రాజెక్టుకు పరిమితం కావాలని రాజమౌళి చెప్పాడని చెప్పుకున్నారు. రాజమౌళిపై నమ్మకంతో ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసిట్లు చెబుతున్నారు. ఇందులో నిజమెంత ఉందో..

 ఇద్దరికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది

ఇద్దరికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది

సెప్టెంబర్ 27 2001 ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ తేదీని ఎవ్వరికి గుర్తున్నా లేకపోయినా కూడా ఇద్దరు మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. రెండోది బ్లాక్ బస్టర్ సినిమాలను ఎంజాయ్ చేసే తెలుగు ప్రేక్షకులు. అప్పటివరకు టివి సీరియల్స్ ను డైరక్ట్ చేస్తున్న శ్రీశైలశ్రీ రాజమౌళి అనే ఓ దర్శకుడు.. కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ''స్టూడెంట్ నెం.1'' అనే సినిమాను తీసి ఆ రోజున రిలీజ్ చేశాడు. సినిమా అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోయింది.

 అప్పుడే ఎన్టీఆర్ అడిగేసాడు

అప్పుడే ఎన్టీఆర్ అడిగేసాడు

‘ఈగ' వేదిక మీదే రాజమౌళి తనతో సినిమా చేయకపోవడం గురించి తెగ ఫీలవుతూ ఎన్టీఆర్ మాట్లాడారు. ఈగ కారణంగా రాజమౌళికి చాలా ఏళ్లు వృథా అయిపోతున్నాయని.. అది పూర్తి చేసి ప్రభాస్ తో సినిమా చేసి తన దగ్గరికి ఎప్పుడొస్తాడని సరదాగానే అసహనం వ్యక్తం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి రాజమౌళి అది పట్టించుకున్నారో లేదో తెలియదు.

 లైట్ తీసుకున్నాడా

లైట్ తీసుకున్నాడా

ఓ ప్రక్క రాజమౌళి దర్శకత్వంలో చేయటం కోసం అఖిల్ సహా ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా రెడీగా ఉన్నారు. ఈగ-2 కూడా లైన్లోకి వస్తున్నట్లుంది. మరో ప్రక్క రాజమౌళి మహాభారతం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే తనతో రాజమౌళితో సినిమా చేయడం గురించి ఆలోచించడం వృథా అని భావించి ఈ మధ్య రాజమౌళి ఊసే ఎత్తట్లేదు ఎన్టీఆర్. తనంతట తాను వచ్చి సినిమా చేస్తే చూద్దాం అనుకుని.. తన కెరీర్ ను రాజమౌళితో సంబంధం లేకుండా దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు తారక్ అని చెప్తున్నారు. బెస్టాఫ్ లక్ ఎన్టీఆర్.

English summary
15th year anniversary of NTR's film Student No. 1. NTR showered love upon his good friend and well wisher Rajamouli as he completed fifteen years as the director. “15 long years. From a budding directer to being one of India's most respected directors my jakkanna has come a long way,” NTR tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu