బాలయ్య ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఎన్టీఆర్.. మోక్షజ్ఞపై ఒక్క ట్వీట్‌తో తేల్చిపడేసిన యంగ్ టైగర్
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఎన్టీఆర్ సినీ రంగంపై చూపించిన ప్రభావమే. ఆయన తర్వాత తరంలో బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం వీళ్ల వ్యవహార శైలిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు, వాళ్ల కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయని చాలా కాలం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీపై తారక్ ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసమే!
సిద్ధం అయిపోయిన మోక్షజ్ఞ
నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ లుక్‌లో చాలా మార్పులు వచ్చాయి. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ తర్వాత అతడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నాడు.

సినిమాల్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ
బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ప్రవేశం గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అతడి మొదటి చిత్రం ఫలానా దర్శకుడితోనే ఉంటుందని ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ పరిచయం చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
ఫస్ట్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తూ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. అంతేకాదు, దీని నుంచి అతడి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీని ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

శుభాకాంక్షలు.. తారక్ కూడా
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్నాడన్న ప్రకటన రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ముఖ్యంగా అతడికి బెస్ట్ విషెస్ చెబుతూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు సైతం పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం తాజాగా ట్వీట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు.
తాతగారితో పాటు దేవుళ్లు
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన X (ట్విట్టర్) ఖాతాలో 'సినిమా ప్రపంచంలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నందుకు నీకు అభినందనలు. నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోన్న వేళ.. అందరు దేవుళ్లతో పాటు తాతగారి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ' అంటూ మోక్షజ్ఞకు తన బెస్ట్ విషెస్‌ను తెలియజేశాడు.
ఫ్యాన్స్ షాక్.. సంతోషంలో
బాలకృష్ణ ఫ్యామిలీకి, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఉన్నాయంటూ చాలా కాలంగా వస్తున్న వార్తలతో నందమూరి ఫ్యాన్స్ బాధగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం చాలా మందికి షాక్ ఇవ్వగా.. నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











