బాలయ్యకు మాత్రమే కాదు...జూ ఎన్టీఆర్‌కూ నచ్చింది!

By Bojja Kumar

హైదరాబాద్: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంపై పలువురు సినీ సెలబ్రిటీల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.....ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయి కొర్రపాటిపై అభినందనల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో నందమూరి హీరో జూ ఎన్టీఆర్ కూడా 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని చూసి....'సినిమా బాగుంది. ఇటువంటి సినిమాలు తెలుగులో మరెన్నో రావాలి' అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి, చిత్ర దర్శకుడు శ్రీని అవసరాలకు హీరో హీరోయిన్లు నాగ శౌర్య-రాశిఖన్నాకు అభినందనలు తెలిపారు.

Jr NTR Tweets ON Oohalu Gusagusalade Movie

'ఊహలు గుసగుసలాడే' చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెకారిలో ఉంటున్న తెలుగు వారిని కూడా తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే అమెరికాలో 48,232 డాలర్స్ వసూలు సాధించి సరికొత్త రికార్డును సాధించింది.

దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వ తీరు బాగుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది తనకు తొలిచిత్రమే అయినప్పటికీ ట్రెయిలర్లు, ప్రోమోల ద్వారా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో శ్రీనివాస్ సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X