కొమరం భీం, అల్లూరి బయలుదేరారు.. ఉత్తర భారతంలో విధ్వంసమే, ఎన్టీఆర్ ట్వీట్!

Recommended Video

Jr NTR Tweets On RRR Movie North India Shoot || Filmibeat Telugu

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశాడు.

 ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తాను ఏ అంశం ఆధారంగా తెరకెక్కిస్తున్నానో రాజమౌళి వివరించారు. 1920 సమయంలో యుక్తవయసులో ఉన్న అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం దాదాపు ఒకే టైం పీరియడ్‌లో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ స్నేహితులు అయితే ఏం జరిగి ఉంటుందనే ఊహలోనుంచే ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభమైందని రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే.

 ఎక్కువ భాగం నార్త్‌లో

ఎక్కువ భాగం నార్త్‌లో

అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఆ సమయంలో ఉత్తర భారతంలో పర్యటించారని చరిత్రలో ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఉత్తర భారతంలో తెరకెక్కించబోతున్నాడు. చిత్ర యూనిట్ ఈ మేరకు పూణే, డిల్లీ, వడోదర, కోల్ కతా లాంటి నార్త్ ఇండియన్ నగరాల్లో భారీ షెడ్యూల్స్ కి ప్లాన్ చేసింది. నార్త్ ఇండియాకు బయలుదేరుతున్న విమానం టికెట్స్‌ని జూ. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

బయలుదేరిన అల్లూరి, కొమరం

చిత్ర యూనిట్ మొత్తం నేడు గుజరాత్‌లోని వడోదర నగరానికి బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు జూ. ఎన్టీఆర్ తనకు, రాంచరణ్ కు బుక్ అయి ఉన్న ఫ్లైట్ టికెట్స్‌ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఎన్టీ రామారావు, కొణిదెల రాంచరణ్ అనే పేరుతో విమానం టికెట్స్ బుక్ అయి ఉన్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ నార్త్ ఇండియాలోనే జరుగుతుందని అంటున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటించే భారీ యాక్షన్ సన్నివేశాల్ని రాజమౌళి ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటీనటులు

బాలీవుడ్ నటీనటులు

ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరింత క్రేజ్ పెంచేలా రాజమౌళి ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో అలియాభట్ రాంచరణ్‌కు హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంజయ్ దత్, వరుణ్ ధావన్ లాంటి నటుల ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తోంది. తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X