»   » ఓ రేంజ్ లో మెగా ప్లాప్ దెబ్బకి జూ ఎన్టీఆర్ చెంతకి చేరిన దర్శకుడు..!?

ఓ రేంజ్ లో మెగా ప్లాప్ దెబ్బకి జూ ఎన్టీఆర్ చెంతకి చేరిన దర్శకుడు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బొమ్మరిల్లు"తో ఓ అద్భుత విజయాన్నీ, 'పరుగు"తో ఓ మోస్తరు విజయాన్నీ సాధించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న భాస్కర్ కి'ఆరెంజ్"ఓ రేంజ్ లో స్ట్రోక్ ఇచ్చింది. దాంతె మళ్లీ తనేంటో ప్రూవ్ చేస్కోవాలని కసిగా కలం పట్టిన భాస్కర్ ఓ ట్రెమండస్ సబ్జెక్ట్ ని రెడీ చేసి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు..నిజానికి 'ఆరెంజ్" తర్వాత సూర్య తమ్ముడు కార్తీ హీరోగా ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ ఒకేసారి విడుదలయ్యేలా ఓ ద్విభాషా చిత్రం చేసేందుకు సిద్దమయ్యాడు భాస్కర్.

అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో మెటీరియలైజ్ అయ్యేలా లేకపోవడం, అంతలోనే ఎన్టీఆర్ తో సినిమా చేసే దారులు తెరుచుకోవడంతో భాస్కర్ ప్రస్తుతం తారక్ ని ఒప్పించి మెప్పించేందుకు తయారవుతున్నాడు. మరి మెగా ప్లాప్ దెబ్బకి ఎన్టీఆర్ చెంతకి చేరిన భాస్కర్ తన సబ్జెక్ట్ తో యంగ్ టైగర్ ని పడగొట్టి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడా..గత పరాజయాన్ని తుడిచిపెట్టేసే ఘన విజయం సాధించగలుగుతాడా అనేది వేచి చూడాలి..

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సైమంటేనియస్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి,"బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'చురకత్తి"ప్రొజెక్ట్స్ లో బిజీగా వున్నాడు. ఇవే కాకుండా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమాకి తర్వాత త్రివిక్రమ్ దర్వకత్వంలో ఓకే చేసాడని సమాచారం. అయితే భాస్కర్ తో తీయాలంటే ఆ ప్రొజెక్ట్ అన్నీ జూ ఎన్టీఆర్ కంప్లీట్ చేయాల్సివుంది. సో అంతవరకు భాస్కర్ జూ కోసం వెయిట్ చేస్తాడా..జూ అతని స్ర్కిప్ట్ కి ఓకే అంటాడా అనేది అధికారింగా తెలియాల్సి వుంది..

English summary
Tollywood's A 1 Star Young tiger Jr Ntr is in signing spree.Jr Ntr working out with story discussions with different directors and okeying their projects.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu