ఖలేజా తోకముడిచింది బృందావనం ఫ్రీ బర్డ్ అయింది.....!?
అక్టోబర్ 14కి 'బృందావనం" విడుదల వాయిదా వేశామని చెప్పగానే సొంత అభిమానులే జూ ఎన్టీఆర్ పై కదం తొక్కారు. వేరే సినిమాలను చూసి భయపడి పారిపోతావా అంటూ గట్టిగా నిలదీశారు. అయితే అన్నీ ఆలోచించి దిల్ రాజు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బృందావనంకి అనుకూలంగా మారింది. 'రోబో" హవాలో రిలీజైన మహేష్ 'ఖలేజా" పరిస్థితి చూస్తుంటే, బృందావనం విడుదల వాయిదా వేయడమే మంచిదైందని అనిపిస్తోంది. బృందావనంకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని అనుకున్ ఖలేజా తొలి రోజునే తోక ముడిచింది.
మహ అయితే యావరేజ్ కావడం మినహా ఈ చిత్రం పెద్దగా పొడిచేదేమీ ఉండదని తేల్చేయడంతో బృందావనంకి లైన్ క్లియర్ అయింది. ఇదిలావుంటే సెన్సార్ పూర్తి చేసుకున్న బృందావనంకి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. జూ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాకి క్లీన్ యు రావడం అంటే విశేషమనే చెప్పాలి. అన్ని సినిమాలకూ వచ్చినట్టే ఈ చిత్రానికి సెన్సార్ రిపోర్ట్ అంటూ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం ప్రథమార్థం యావరేజ్ గా ఉందని, ద్వితీయార్థం ఆహ్లాదంగా సాగిందని తెలుస్తోంది. కామెడీ మాస్ ని కూడా సమానంగా ఆకట్టుకోగలదని టాక్ వినిపిస్తోంది. బృందావనం చుట్టూ ఉన్న పాజిటివ్ బజ్ తో జూ ఎన్టీఆర్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు. మహేష్ కి భయపడి పారిపోయాడని వచ్చిన విమర్శలకు సినిమాతోనే సమాధానం చెప్పగలననే నమ్మకం పెరగడంతో జూ ఎన్టీఆర్ మరింత సంబరపడుతున్నాడు.


Click it and Unblock the Notifications











