»   » జూ ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో మూవీ ఖరారు!

జూ ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో మూవీ ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఆది, సాంబ, అదుర్స్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి. తాజాగా వీరి కాంబినేషన్లో 4వ ప్రాజెక్టు ఖరారైంది.

మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షుకులు మెచ్చే కామెడీ, ఇతర అంశాలతో కూడిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా, విభిన్నమైన కథాంశంతో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది అదుర్స్ చిత్రానికి సీక్వెల్ కాదని సమాచారం. 2014లో ఈ సినిమా షూటింగ్ మొదలై 2015 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

జూ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగిన విధంగానే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే నిర్మాత ఎవరు? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్, వినాయక్ ఈ చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి 'జోరు', 'రభస' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

English summary
Young Tiger NTR who is busy with the shooting schedules of his next film Joru in Santhosh Srinivas direction has finalized his next project with VV Vinayak as director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu