‘నాయక్’ ఫస్ట్ డే... ఫస్ట్ షో చూడనున్న జూ ఎన్టీఆర్
హైదరాబాద్: మీరు విన్నది నిజమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రాన్ని యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఫస్ట్ డే... ఫస్ట్ షో చూడబోతున్నారు. కాచిగూడలో కొత్తగా పున:ప్రారంభం కాబోతున్న 'తారకరామా' థియేటర్లో జూ ఎన్టీఆర్ నాయక్ చిత్రాన్ని వీక్షించబోతున్నారు.
హైదరాబాద్‌లోని ఓల్డ్ థియేటర్లలో ఒకటైన తారకరామా థియేటర్ గత కొంత కాలంగా నడవటం లేదు. దీంతో పాతదాని స్థానంలో కొత్త థియేటర్ ను అధునాతన హంగులతో నిర్మించారు. ఈ నెల 9న ఈ థియేటర్ రామ్ చరణ్ 'నాయక్' సినిమాతో పున: ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో హాజరైన మార్నింగ్ షో వీక్షిస్తారని తెలుస్తోంది.
కొత్తగా పున:ప్రారంభం కాబోతున్న ఈ థియేటర్లోని అధునాత సౌకర్యాల విషయానికొస్తే... లేటెస్ట్ జేబిఎల్ సౌండ్ సిస్టం, లగ్జరీ సీటింగ్, మల్టీప్లెక్స్ సినిమా ఎక్స్పీరియన్స్, భారీగా పార్కింగ్ సౌకర్యం కలదు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమల పాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు.
సంక్రాంతి పడగను పురస్కరించుకుని జనవరి 9న 'నాయక్' చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితనే 'నాయక్' టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గిరిజన విద్యార్థి ఆందోలనకు సిద్ధం అవుతున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ సైతం నిర్మాతలు, అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రానికి కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











