నందమూరి వంశ ప్రతిష్ట ఇనుమడించే విధంగా జూ ఎన్టీఆర్ పెళ్ళి కార్డు..
జూ ఎన్టీఆర్ పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటినుంచే హడావుడి మొదలైంది. మే5నలక్ష్మీ ప్రణతిని జూ ఎన్టీఆర్ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. జూ ఎన్టీఆర్ పెళ్లి కార్డు ఇచ్చి తమ బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఆ పెళ్లి కార్డులో జూ ఎన్టీఆర్, ప్రణితల ఫోటో ఎక్కడ కనిపించలేదు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టేవిధంగా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న జూనియర్ పెళ్ళి శుభలేఖను కూడా సంప్రదాయానికి విలువిచ్చే విధంగా నందమూరి వంశ ప్రతిష్ట ఇనుమడించే విధంగా తయారు చేయించాడు. ఢిల్లీ లో డిజైన్ చేయించిన ఈ కార్డుకు 3000 రూపాయలు అయ్యిందని తెలుస్తుంది. తన తాత ఎన్టీఆర్ ఆశీస్సులతో పెళ్లి జరుగుతున్నట్టుగా నందమూరి ఎన్టీఆర్ ఫోటోను ఈ కార్డులో ప్రచురించారు.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ వివాహ వేడుక ఘనంగా జరగనుంది. భారీ బడ్జెట్ తోనే ఈ పెళ్లిని జరపాలని నందమూరి కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఇక యన్.టి.ఆర్ స్వయంగా వెళ్ళి ప్రముఖులను, స్నేహితులను పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. సోమవారం నాడు చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, రమేష్ ప్రసాద్ ఇళ్ళకు వెళ్ళి ఆహ్వానించి వచ్చాడు. అలాగే రాజమౌళి. వివి వినాయక్ లను స్వయంగా ఆహ్వానించాడు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా యన్.టి.ఆర్ పెళ్ళిని చేయతలపెట్టారు నార్నే, నందమూరి కుటుంబాలవారు. ఈ పెళ్ళిలో మెహంది, సంగీత వంటి ఉత్తరాది సంప్రదాయాలకు చోటులేదు. ఈ వివాహానికి జూ ఎన్టీఆర్ అభిమానులు మరోవైపు నందమూరి కుటుంబ అభిమానులు భారీగానే తరలివచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











