జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళికి ఫ్యాన్స్ నుండి గమ్మత్తైన గిప్ట్స్..!?

By Sindhu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ వివాహం అయన అభిమనుల్లొ ఎనలేని ఆనందాన్ని నింపింది. స్వయంగా వచ్చి జూ ఎన్టీఆర్ పెళ్ళి తిలకించాలని వారందరూ ఉత్సహం కనబరుస్తున్నారు. మరికొంతమంది విలువైన కానుకలతొ తమ అభిమనం చాటుకొవాలనుకుంటున్నారు. జూ ఎన్టీఆర్ పెళ్ళి నిశ్చయం కాగనే ధర్మవరం ప్రాంతానికి చెందిన నేతకారుడు నవరత్నాలు పొదిగిన అత్యంత విలువైన చీరను నేసి పెళ్ళిరోజున జూ ఎన్టీఆర్ కు అందజేస్తానని ప్రకటించాడు. అలాగే భద్రచలంలో జూ ఎన్టీఆర్ అభిమనులు రాములు వారి కళ్యాణానికి సమర్పించిన పట్టు వస్త్రాలను, కళ్యణంలో వాడిన ముత్యాల తలంబ్రాలను సేకరించి పెళ్ళిరొజున నూతన దంపతులకు అందజేయనున్నారు.

మరో అభిమాని ఒక అడుగు ముందుకేసి జూ ఎన్టీఆర్, ప్రణతి జంటపై ఒక పాటను రుపొందించి విడుదల చేశాడు. ఈ గీతాన్ని వసంత్ వ్రాయగా అర్జున్ స్వరకల్పనలో గీతమాధురి, శ్రీక్రిష్ణ ఆలపించారు. జూనియర్ వీరాభిమాని అమిర్నేని రామకృష్ణ ఈ గీతాన్ని నిర్మించాడు. ఇలా మరెన్నో కానుకలు జూ ఎన్టీఆర్ పెళ్ళికి అభిమానులు అందజేయనున్నారని తెలుస్తుంది.

మరో వైపు పెళ్ళి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కళ్యాణ మండపం శోభాయమనంగా రూపుదిద్దుకుంటుంది. మే 5న జరగనున్న యన్.టి.ఆర్ వివాహమహోత్సవానికి అభిమానులు, ప్రముఖులు కలిపి 10,000 మంది అతిధులు హాజరు కానున్నారని సమాచారం. మొత్తం మీద యన్.టి.ఆర్ పెళ్ళిని అంగరంగవైభవంగా జరపటానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X