»   » తన అభిమాన హీరోయిన్ ని చూడటానికి జూ ఎన్టీఆర్ వస్తాడా..!?

తన అభిమాన హీరోయిన్ ని చూడటానికి జూ ఎన్టీఆర్ వస్తాడా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీ అభిమాన కథానాయిక ఎవరు?అని ఎన్టీఆర్ ను అడిగితే..శ్రీదేవి అని చెబుతుంటాడు. జూ ఎన్టీఆర్ కి శ్రీదేవి అంటే బాగా ఇష్టమని, ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ అని, కుదిరితే నా శక్తి మేరకు ఒక సాంగ్ అయినా ఆమెతో చేయటానికి ప్రయత్నిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

మరైతే ఈరోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందనున్న 'కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: అప్పలరాజు"సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి అతిలోక సుందరి శ్రీదేవి అతిథిగా వస్తోంది. ఎన్టీఆర్ నటిస్తోన్న 'బృందావనం" షూటింగ్ కూడా ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతోంది. మరి..శ్రీదేవి ఈ స్టూడియోకి వస్తోంది కాబట్టి ఎన్టీఆర్ ష్యాట్ గ్యాప్ లో ఆమెను చూడటానికి వస్తాడో లేదో వేచి చూడాల్సిందే...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu