జూ ఎన్టీఆర్ అతనికి హిట్ ఇస్తాడా..లేక పవన్ కళ్యాణ్ లా..?
రవితేజతో ఆంజనేయులు, పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ చేసి చేతులు కాల్చుకున్న గణేష్ బాబు బేనర్ పేరును పరమేశ్వర ప్రొడక్షన్స్ గా మార్చి పవన్ తోనే 'గబ్బర్ సింగ్" చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్లు దర్శకత్వంలో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి..ఎన్టీఆర్, శ్రీను వైట్ల ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్నఈ సినిమా సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను సినిమాల తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.
పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో ఆగస్ట్ లో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. నిర్మాత గణేష్ బాబు ఇప్పటి వరకు నిర్మించిన రెండు సినిమాలూ ప్లాప్ అయ్యి అతన్ని నష్టాల్లోకి నెట్టాయి. మరి పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్", జూ ఎన్టీఆర్ సినిమా అతనికి ఏవిధంగా హెల్ఫ్ అవుతాయో చూడాలి.
jr ntr srinu vytla ganesh babu pawan kalyan teen maar gabbar singh జూ ఎన్టీఆర్ శ్రీనువైట్ల గణేష్ బాబు పవన్ కళ్యాణ్ తీన్ మార్ గబ్బర్ సింగ్


Click it and Unblock the Notifications