జూ. ఎన్టీఆర్ కోసం అభిమానులంతా.. అరవింద సమేత తర్వాత మళ్ళీ!

Recommended Video

Jr NTR Will Grace The NTR Biopic Audio Launch Event | Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి హీరోలలో ఫుల్ జోష్ లో ఉన్న హీరో. ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సర్వం సిద్ధం అవుతోంది. నేడు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు ఈ ఈవెంట్ కు హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూ. ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జూ.ఎన్టీఆర్ కోసం

జూ.ఎన్టీఆర్ కోసం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం నందమూరి అభిమానులు మొత్తం ఎదురుచూస్తున్నారు. ఆడియోలాంచ్ కార్యక్రమంలో బాలయ్య పక్కనే ఎన్టీఆర్ ని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కావడం, స్వయంగా బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ జీవితంలో అనేక పరిణామాలు, ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. ఆ సన్నివేశాలు ఎలా చూపించారని ఆసక్తి నెలకొంది.

అరవింద సమేత తరువాత

అరవింద సమేత తరువాత

ఎన్టీఆర్, బాలకృష్ణ చాల తక్కువ సందర్భాల్లో వేదికలపై కనిపించారు. ఇటీవల నెలల వ్యవధిలోనే అబ్బాయి, బాబాయ్ కలసి ఒకే వేదికపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరవింద సమేత విజయోత్సవ వేడుకకు బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు బాబాయ్ సినిమా కోసం ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు కానుండడం విశేషం.

 నందమూరి కుటుంబ సభ్యులంతా

నందమూరి కుటుంబ సభ్యులంతా

నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రానా, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, విద్యాబాలన్ ఇలా చాలామంది స్టార్స్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో భాగం అవుతున్నారు. క్రిష్ జాగర్లమూడీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూన్నట్లు తెలుస్తోంది.

రెండు భాగాలుగా

రెండు భాగాలుగా

ఎన్టీఆర్ చిత్ర ఆడియో వేడుకకు అలనాటి తారలు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి దిగ్గజ నటులు హాజరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లోని తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల కానుంది,. రెండవ భాగాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీరంగ విశేషాలు, రెండవ భాగంలో రాజకీయ రంగ విశేషాలు ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X