twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెలో బాధను దిగమింగుకుని... షూటింగ్‌కు సిద్ధమైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Jr NTR will Join For Aravindha Sametha From September 1

    నందమూరి హరికృష్ణ మరణం తెలుగు సినిమా పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అందులోనూ ఆయన ఫ్యామిలీలో ఇంకెంత విషాదం ఉంటుందో ఊహించుకోవచ్చు. నాన్న అంటే ప్రాణంగా ప్రేమించే జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పడే వేదన మాటల్లో వర్ణించలేం. ఈ బాధ నుండి బయట పడటానికి పనిలో మునిగిపోవడం తప్ప బహుషా మరో మార్గం లేదేమో!

    ఆ మాటలను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్

    ఆ మాటలను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్

    హరికృష్ణ మరణం తర్వాత అభిమానులు.... నాన్నంటే తనకు ఎంత ఇష్టమో ఎన్టీఆర్ గతంలో ‘నాన్నకు ప్రేమతో' సినిమా ఆడియో వేడుకలో వివరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తండ్రి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఎన్టీఆర్ స్పీచ్‌కు అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.

    ‘మేమంతా నాన్న పిచ్చోళ్లం’ అంటూ ఆరోజు ఎన్టీఆర్ (డిసెంబర్ 27, 2015 నాటి మాటలు)

    ‘మేమంతా నాన్న పిచ్చోళ్లం’ అంటూ ఆరోజు ఎన్టీఆర్ (డిసెంబర్ 27, 2015 నాటి మాటలు)

    ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుక సమయంలో దేవిశ్రీ అన్న మాటలను ఎన్టీఆర్ ఉటంకిస్తూ.. ‘నాన్నగారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మా నాన్నే నాకు గొప్ప స్ఫూర్తి. నేను అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కూడా ఆయనే. ఈజు డోంట్ స్టాప్ అనే పాట రఘు దీక్షిత్ తో పాడించాను. ఏదో ఒక కారణంతో పని ఆపడం నాన్నగారికి ఇష్టం ఉండదు.' అని చెప్పినట్లు తెలిపారు.

    ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే... ‘మేమంతా నాన్న పిచ్చోళ్లం' అని తారక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

    జూనియర్లో ఇంకెంత బాధ దాగి ఉందో?

    జూనియర్లో ఇంకెంత బాధ దాగి ఉందో?


    సినిమాటిక్‌గా తీయాలి కాబట్టి ‘నాన్నకు ప్రేమతో' కథను రకరకాలుగా మార్చి ఉండవచ్చు. కానీ, ఇది దర్శకుడు సుకుమార్‌గారి నాన్నగారి కథ. ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డా. మా నాన్నకు ఏదైనా అయిపోతుందంటే నేనైతే ఊహించుకోలేను. మనిషిని మామూలుగా ఉండలేను. అలాంటిది ఆయనకున్న బాధను దిగమింగుకొని సుకుమార్ వాళ్ల నాన్నకు నివాళిగా ఈ కథ రాశారు. ఇలాంటి దర్శకుడు ఎప్పుడూ పుట్టడు. ఆయన రాసే ప్రతి కథలో జీవితం ఉంటుంది.'' అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

    నాన్నకు ఏదైనా అయిపోతుంది అనే ఊహకూడా భరించలేని ఎన్టీఆర్ నాన్నను కోల్పోయిన తర్వాత ఇంకెంత బాధను అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

    అరవింద సమేత

    అరవింద సమేత

    ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న ‘అరవింద సమేత' చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. హరికృష్ణ మరణంతో ఈ చిత్రం షూటింగుకు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 1 నుండి తారక్ జాయిన్ అవుతుండటంతో మళ్లీ షూటింగ్ మొదలుకాబోతోంది.

    కళ్యాణ్ రామ్ మూవీ

    కళ్యాణ్ రామ్ మూవీ

    ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంత బాధలో కూడ ఆయన నిలిచిపోయిన చిత్రీకరణను ప్రారంభించమని దర్శక నిర్మాతలకు చెప్పారట. సోమవారం నుండి ఆయన షూటింగ్లో పాల్గొననున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాత. నివేత థామస్, షాలిని పాండే హీరోయిన్లు.

    English summary
    Jr NTR will resume shooting for Aravindha Sametha from tomorrow. Kalyan Ram will resume shooting for #NKR16 from Monday (September 3rd).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X