నిన్న జూ ఎన్టీఆర్‌కు రాసారు..నెక్ట్స్ బాలయ్యకు!
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'బాద్ షా' చిత్రానికి స్ర్కిప్టు అందించిన ప్రముఖ స్క్రిప్టు రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు....త్వరలో బాలయ్య సినిమాకు స్క్రిప్టు రాయబోతున్నారు. ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...'నేను, గోపీ మోహన్ తొలి సారిగా బాలయ్య సినిమాకు కలిసి పని చేయబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు. ఈచిత్రాన్ని కొత్త నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గోపీ మోహన్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్లుగా కొనసాగుతున్నారు. ఇద్దరు కలిసి పని చేసిన దూకుడు, కింగ్ చిత్రాల్లో పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు బాగా పేలాయి. ప్రస్తుతం వీరు జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రంతో పాటు, మంచు విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ', వెంకీ 'షాడో' చిత్రాలకు పని చేస్తున్నారు.
బాలయ్య త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాబోయే సినిమాలో చేబోతున్నట్లు తెలుస్తోంది. సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో తన గత సినిమా 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందబోతున్న 'ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











