ఆచార్య రికార్డును బ్రేక్ చేసిన దేవర.. చిరంజీవిపై ఎన్టీఆర్ పైచేయి!
Devara: మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ భారీ బడ్జెట్ మూవీ 'దేవర'లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఓ క్రేజీ రికార్డును బ్రేక్ చేసినట్టు టాక్. ఇంతకీ ఆ రికార్డు ఏంటో మీరు కూడా లూక్కేయండి.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర మూవీలో జూ. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంటే. ఈ మూవీ విడుదలకు కేవలం 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇప్పటికే విడుదల అయిన మూవీ అప్టేడ్ప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. ఈ చిత్రం నుంచి వచ్చిన మూడవ లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబటట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ అప్టేడ్స్ కేవలం నందమూరి అభిమానుల నుంచే కాకుండా మూవీ లవర్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇలా మూవీ నుంచి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ మూవీ మీద అంచనాలు పెంచుతున్నారు దేవర మూవీ మేకర్స్ .
ఇదిలా ఉంటే.. దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. దేవర ఓపెనింగ్ డే ప్రీ సేల్స్ దుమ్మురేపాయి. ఫస్ట్ డే ఓవర్సీస్ కలెక్షన్ల తో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డు చేసింది. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. సక్సెస్ పుల్ డైరెక్టర్ కొరటాల శివ గత దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆచార్య నార్త్ అమెరికాలో ఫుల్ రన్ ($985K)ను రిచ్ కాగా.. రిలీజ్ కు 17 రోజులు ఉండగానే దేవర ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఈ జోష్ ఇలానే ఉంటే.. రిలీజ్ నాటికే దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటవచ్చని ట్రేడ్ వర్గాలు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇండియన్ సీని ఇండస్ట్రీలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన మొదటి భారతీయ చిత్రం
గా దేవర రికార్డు క్రియేట్ చేసింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర'కు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను సెప్టెంబర్ 10 (నేడు)న విడుదల చేయనున్నట్లు దేవర టీం ప్రకటించింది.ఈ ట్రైలర్ ఈవెంట్‌ను ముంబైలో భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో వరుసగా ప్రమోషన్స్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నరంట. ఇక మూవీ కలెక్షన్స్ కూడా బాక్సాఫీసు వద్ద మోత మోగనున్నాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











