Jr NTR ఫ్యాన్ మృతి కేసులో ట్విస్టు..నా కుమారుడిది హత్యే.. శ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు
ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మేడిశెట్టి ఆత్మహత్య సంఘటన మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ పోలీసులు ఇచ్చిన వివరణపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శ్యామ్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మరణం ఆత్మహత్య కాదు. తన కుమారుడు మరణం వెనుక వాస్తవాలను బయటపెట్టాలని ఆయన ఏపీ పోలీసులను డిమాండ్ చేశారు. శ్యామ్ తండ్రి ఎం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..
తిరుపతికి వచ్చిన శ్యామ్ పనులన్నీ చేసుకొని తూర్పు గోదావరి జిల్లా చింతలూరు గ్రామం తిరిగి వచ్చారు. శుక్రవారం రాత్రి 9.45 గంటలకు వాళ్ల అమ్మకు ఫోన్ చేశారు. వాళ్ల అమ్మకు ఏదో అనుమానం వచ్చి వీడియో కాల్‌లో మాట్లాడింది. తల్లితో మాట్లాడుతూ డాడీని డబ్బులు పంపించను. తెల్లారి వచ్చేస్తానని చెప్పాడు అని శ్రీనివాసరావు మీడియాతో అన్నారు.

శనివారం ఉదయం తెల్లవారు జామున లేవగానే మా బంధువులు వచ్చి శ్యామ్‌కు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. దాంతో మేము హాడావిడిగా అమలాపురం చేరుకొన్నాం. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా హాస్పిటల్‌కు వెళ్లాం. అక్కడ శ్యామ్ బాడీని ఫ్రీజర్‌లో పెట్టి ఉంచారు. ఆదివారం కావడంతో ఈ రోజు పని కాదంటే.. ఇంటికి వెళ్లిపోయాం. సోమవారం ఉదయం మళ్లీ హాస్పిటల్‌కు వచ్చాం అని తెలిపారు.
సోమవారం ఉదయం హాస్పిటల్‌లో పోలీసులు పంచనామా చేశారు. మా వెంబడి శ్యామ్ స్నేహితుడు కానిస్టేబుల్ కూడా ఉన్నారు. నా కొడుకు స్నేహితుడు నాతో మాట్లాడుతూ.. శ్యామ్‌ది హత్యే అని చెప్పారు. ఏం బాధపడకు. నీ కొడుకును ఖచ్చితంగా హత్య చేశారని చెప్పడంతో డీఎస్పీని కలిశాం అని శ్రీనివాసరావు చెప్పారు.
డీఎస్పీని కలిసినప్పుడు మూడు వీడియోలు చూపించారు. అందులో శ్యామ్ వెనుకాల ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. దాంతో నా కొడుకు కాళ్లను విరిచి వేసి ఉంటారు. కాళ్లు వంచి ఉండటంతో అనుమానం వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ, చిత్తూరు, తిరుపతిలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు ఫోన్లు చేస్తున్నారు అని శ్రీనివాసరావు తెలిపారు.
శ్యామ్‌ది ఆత్మహత్య కాదు. మీరు ఎప్పటికీ ఒప్పుకోవద్దు. హత్యే జరిగింది. మా ఇంటి వద్ద కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ అనుమానాల నేపథ్యంలో నా కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఎవరి మీద ఉందని చెప్పలేం. కాబట్టి దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం అని చెప్పారు.
శ్యామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీకి పోలీసులకు శ్యామ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నా కుమారుడు ఉరి వేసుకొని మరణించారని చెప్పారు. కానీ నా కుమారుడిది సహజ మరణం కాదు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని మా కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది. ఈ వ్యవహరంపై దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు పత్రంలో శ్యామ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











