మా అన్న పిరికివాడు కాదు.. ఆత్మహత్య చేసుకోడు.. ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సోదరి సంచలన వ్యాఖ్యలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మేడిశెట్టి అనుమానాస్పద మరణం అనేక సందేహాలకు దారి తీస్తున్నది. శ్యామ్ మరణం వెనుక వ్యక్తిగత కారణాలే ఉన్నాయి. ఆయన మరణం ఆత్మహత్యే అంటూ ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్వీట్టర్ వేదిక శ్యామ్ ఆత్మహత్య గురించి వివరాలు అందించింది. అయితే తాజాగా శ్యామ్ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలను వెల్లడించారు. శ్యామ్ చెల్లెలు మీడియాతో ఏం మాట్లాడింది? శ్యామ్ మరణం గురించిన వివరాల్లోకి వెళితే..

శ్యామ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్టీఆర్ అభిమాని నిరుద్యోగి. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ చనిపోయిన ప్రదేశం చింతలూరు గ్రామం. జూన్ 24 రాత్రి నుంచి జూన్ 25 తేదీ తెల్లవారుజామున మధ్య శ్యామ్ మరణం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Jr NTRs fan Shyam Medishetty sister made sensational comments on her brothers death

అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. శ్యామ్ తన ఇంటిలో కుర్చీ మీద నిలబడి ఉరి వేసుకొన్నట్టు కనిపించింది. అయితే ఆయన బాడీ మోకాలి వరకు నేలపై ఉంది. చేతికి బలమైన గాయం ఉంది. నోట్ల గంజాయి పెట్టినట్టు కనిపిస్తున్నది. అలాగే జేబులో గంజాయి ప్యాకెట్ ఉన్నట్టు సమాచారం. చింతలూరు గ్రామంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శ్యామ్ మరణంపై:మా అన్నయ్య మరణం తర్వాత ఎన్టీఆర్ అభిమానులు మాకు అండగా ఉన్నారు. మా అన్నయ్య ఆత్మహత్య చేసుకోడు. మా అన్నయ్య గురించి అందరికి తెలుసు. అన్నయ్య పిరికివాడు కాదు. మా అన్నయ్య హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే చదువుకొన్నాడు.నాకు ఇంట్రెస్ట్ లేదనే మాట ఎప్పుడూ రాలేదు. చావు గురించి కూడా ఎత్తలేదు అని శ్యామ్ మేడిశెట్టి సోదరి ఆవేదన చెందారు.

మా అన్నయ్య గురించి తెలుసు కాబట్టే తిరుపతి నుంచి చాలా మంది వచ్చి అండగా ఉన్నారు. శ్యామ్ లేకపోయినా మేము మీకు అండగా ఉంటామని చెప్పారు. మా అన్నయ్యకు న్యాయం జరగాలి. మా అన్నయ్య మరణం వెనుక నిజాలు బయటకు రావాలి అని శ్యామ్ సోదరి కంటతడి పెడుతూ మీడియాకు చెప్పారు.

శ్యామ్ మెడిశెట్టి మృతి గురించి ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రకటన చేసిన తర్వాత ఈ కేసు ఆత్మహత్యే అనే అభిప్రాయం నెలకొన్నది. అయితే తాజాగా ప్రభుత్వం, పోలీసుల ప్రకటనకు విరుద్ధంగా శ్యామ్ చెల్లెలు మీడియాకు ముందు వచ్చి అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు శ్యామ్ మరణం సూసైడేనా? అనే భారీ చర్చకు దారి తీస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X