NTR30: యంగ్ టైగర్ తప్పుకొన్నాడా? త్రివిక్రమ్‌కు తారక్‌కు మధ్య అసలేం జరిగింది?

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. చరిత్రలో అసలు కలవని వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే స్వతహాగా రాజమౌళి సినిమా మొదలైతే త్వరగా హీరోలను వదలడు అనే అపవాదు ఉంది. ఆ అపవాదును దూరం చేయడానికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా గతంలో అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెరకెక్క అంశం మీద సందిగ్ధత నెలకొంది.

ఎలా మొదలయిందో కానీ

ఎలా మొదలయిందో కానీ

గత కొద్దిరోజులుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ చేయబోతున్న ఎన్టీఆర్ 30వ సినిమా క్యాన్సిల్ అయ్యిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎలా మొదలయిందో కానీ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా ఒప్పుకున్న కారణంగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా నిర్మాతను, దర్శకుడిని, ఎన్టీఆర్ పీఆర్ స్టాఫ్ ను ట్యాగ్ చేసి మరీ ఎన్టీఆర్ అభిమానులు ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వడానికి సినిమా యూనిట్ సిద్ధమయింది.

అసలు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా ? క్యాన్సిల్ అవుతుందా

అసలు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా ? క్యాన్సిల్ అవుతుందా

ఎన్టీఆర్ 30 గురించి ఈ రోజు క్లారిటీ ఇస్తామంటూ నిన్న ఎన్టీఆర్ పి ఆర్ ఓ, సినిమా నిర్మాత అయిన మహేష్ కోనేరు ఒక ట్వీట్ చేశారు. ఈ రోజు క్లారిటీ ఇస్తామని చెప్పారు కానీ సమయం ఏమి ప్రకటించలేదు. అయితే కొద్ది సేపటి క్రితం ఆ సమయాన్ని కూడా రివీల్ చేశారు. సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు ఒక అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించారు. దీంతో అసలు ఈ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఏమై ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ లోనే ఉన్నారు. అసలు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా ? క్యాన్సిల్ అవుతుందా ? ఒకవేళ క్యాన్సిల్ అయితే ఎందుకు అయినట్టు అనే చర్చలు టెన్షన్ వారిలో ఉంది.

సినిమా క్యాన్సిల్ కాలేదు

సినిమా క్యాన్సిల్ కాలేదు

టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా అయితే క్యాన్సిల్ కాలేదు అని అంటున్నారు. ఎలా పుట్టిందో తెలియదు కానీ ప్రచారం అయితే మొదలయిందని అందుకే ఆ ప్రచారాన్ని ఆపడం కోసమే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని మీద అధికారిక ప్రకటన చేస్తారని, బహుశా అది రష్మిక అయ్యి ఉండవచ్చని అంటున్నారు. అలా ప్రకటన చేసి సినిమా ఆగిపోలేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వేరే విధంగా ప్రచారం అవుతుండటం గమనార్హం.

త్రివిక్రమ్ కాదు కొరటాల

త్రివిక్రమ్ కాదు కొరటాల

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందట. త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు అని, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాక 31వ సినిమా దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడని ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన బుచ్చిబాబు ఒక స్పోర్ట్స్ డ్రామాతో 31వ సినిమాని ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్నారని అని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు ఈ ప్రచారాలకు ఒక క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాయంత్రం దాకా టెన్షన్ పడక తప్పదు అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X