జూ ఎస్వీఆర్ సినిమా షూటింగులో ప్రమాదం
ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్క బోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్‌లో హీరోకి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ఎస్.ఆర్.చరణ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. స్టంట్ మాస్టర్ ప్రకాష్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు - లారీ మధ్య చేజింగ్ సీన్ తీస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో జూనియర్ ఎస్వీఆర్ తృటిలో తప్పించుకున్నారు. ఫైట్ మాస్టర్ ప్రకాష్ తీవ్రమైన గాయాల పాలయ్యాడు. ఆయన ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది. ఈ ప్రమాదంలో మెర్సిడెజ్ బెంజ్ కారు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
ముంబై నటి నీలమ్ హీరోయిన్‌గా నటిస్తున్నఈ చిత్రం పాటల రికార్డింగ్ ఇప్పటికే పూర్తయింది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తోసాగే ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, ఏవీఎస్, గుండు హనుమంతరావు, పృథ్వీ, సుప్రీత్ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: ప్రదీప్ సిహెచ్. కెమెరా: ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: మున్నాకాశి, నిర్మాతలు: ఎస్వీఆర్ బ్రదర్స్, దర్శకత్వం: ఎస్.ఆర్. చరణ్ రెడ్డి.


Click it and Unblock the Notifications











