జూ ఎస్వీఆర్ సినిమా టైటిల్ ‘మిస్టర్ సెవెన్’
ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్క బోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎస్వీఆర్ సరసన కథానాయికగా నీలమ్ ఉపాద్యాయ తెలుగు తెరకి పరిచయమౌతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాకి 'మిష్టర్ సెవెన్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఆర్. చరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని జూ ఎస్వీఆర్ స్వయంగా తాతపేరు మీద స్థాపించిన బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాత వారసుడిగా తెరంగ్రేటం చేయడం అంటే అంతా ఆషామాషీ కాదు. వారసత్వం నిలబెట్టుకోకపోతే...పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే చాలా మంది వారసుల విషయంలో గమనించాం. మరి ఇతగాడి భవిష్యత్ ఏమిటో?
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే జూనియర్ ఎస్వీఆర్ చిన్నపాటి గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తోసాగే ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, ఏవీఎస్, గుండు హనుమంతరావు, పృథ్వీ, సుప్రీత్ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: ప్రదీప్ సిహెచ్. కెమెరా: ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: మున్నాకాశి, నిర్మాతలు: ఎస్వీఆర్ బ్రదర్స్, దర్శకత్వం: ఎస్.ఆర్. చరణ్ రెడ్డి.


Click it and Unblock the Notifications











