చిరంజీవి, మోహన్ బాబు 'పద్మా'లపై గొడవ
2006లో చిరంజీవి పద్మభూషణ్, 2007లో మోహన్‌బాబు పద్మశ్రీ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ ఆ రెండు 'పద్మ' పురస్కారాలను ఉపసంహరించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ కార్య వర్గం రాష్ట్ర గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. 'పద్మ' పురస్కారాలు పొందినవారు ఆదర్శమైన నడవడికతో, నిస్వార్థ బుద్ధితో, అత్యున్నత వ్యక్తిత్వం కలిగి భావితరాలకు స్ఫూర్తిమంతమైన చైతన్యాన్ని అందించాల్సి ఉంటుందన్నారు.వారిద్దరూ అలా చేయకుండా తమ ఉపన్యాసాలతో ఆంధ్ర, రాయలసీమ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి సామాజిక అశాంతికి కారణమవుతున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో తమ సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న భయంతో విద్వేషాన్ని నూరిపోస్తున్నారని దుయ్యబట్టారు.దీనిపై ప్రభుత్వం గానీ,మోహన్ బాబు, చిరంజీవి వర్గీయులు కానీ ఏ విధమైన కామెంట్స్ చేయలేదు.


Click it and Unblock the Notifications











