లీగల్ నోటీసులతో షాకిచ్చిన కంగనా.. దీనికి వాళ్ల సమాధానమేంటో..!

సంచలన నటి కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఇదే వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తుంది. దీనికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా కొందరు అడుగులు వేస్తుంటే.. కంగనా మాత్రం ఈ వివాదాన్ని అస్సలు వదలడం లేదు. ప్రత్యర్థి వర్గం నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌కు భయపడకపోగా వాళ్లకే షాకిచ్చింది ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.

ఇటీవల కంగనా తాజా చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలోని సాంగ్ లాంచింగ్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. తన గత చిత్రం 'మణికర్ణిక.. ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా రివ్యూ విషయంలో ఓ జర్నలిస్టుతో మాట్లాడే సమయంలో కంగనా విచక్షణ కోల్పోయింది. సదరు జర్నలిస్టుపై విరుచుకుపడిన ఆమె.. ''మణికర్ణిక మేకింగ్ విషయంలో నేనేమైనా తప్పు చేశానా..? జాతీయత గురించి సినిమా తీయడమే నేను చేసిన తప్పా..?'' అంటూ అతడిపై ప్రశ్నల వర్షం కురిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Judgementall Hai Kya Star Kangana Ranaut Gave Shock To Journalists

దీనికి ఏమాత్రం తగ్గకుండా సదరు జర్నలిస్టు కూడా గట్టిగానే సమాధానాలు చెప్పాడు. వీరిద్దరూ గొడవ పడిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న కొందరు ఎలాగోలా ఈ గొడవను ఆపగలిగారు. దీని తర్వాతే అసలు కథ మొదలైంది. కంగనాపై జర్నలిస్టులు తిరుగుబాటుకు దిగారు. ఈ వివాదానికి ముగింపు పలకాలంటే కంగనా జర్నలిస్టులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆమె దీనికి స్పందించకుంటే సినిమా కార్యక్రమాలను బహిష్కరిస్తామంటున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కొందరు జర్నలిస్టులు చిత్ర నిర్మాత ఏక్తాకపూర్‌ను కలిశారు.

ఈ వ్యవహారం తర్వాత నిర్మాత జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. అయినా.. వాళ్లు మాత్రం సంతృప్తి చెందలేదు. కంగనానే స్వయంగా తమకు సారీ చెప్పాలని పట్టుబట్టారు. దీంతో రంగంలోకి దిగిన కంగనా.. 'దయచేసి నన్ను బ్యాన్ చేయండి.. నా గురించి వార్తలు రాయకండి' అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీని తర్వాత అంటే గురువారం ఆమె సంచలన అడుగు వేసింది.

Judgementall Hai Kya Star Kangana Ranaut Gave Shock To Journalists

తనను బహిష్కరిస్తున్నామన్న జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఆ సంఘానికి కంగనా నోటీసులు జారీ చేసింది. ఆమె తరఫునన్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ ఈ నోటీసు జారీ చేశారు. ఇందులో ఆమె పలు ఆరోపణలు చేసింది. జర్నలిస్టుల నిబంధనలకు తూట్లు పొడిచారని, అలాగే తన పరువు తీయడం, బాధించడం, ఎగతాళి చేయడం, వేధించడం, నేరపూరితంగా బెదిరించడం వంటివి చేశారని ఆ నోటీసులు పేర్కొంది కంగనా.

ప్రస్తుతం కంగనా చేస్తున్న చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కించారు. మొదటి ఈ సినిమాకు 'మెంటల్ హై క్యా' అని టైటిల్ పెట్టారు. అయితే, దీనిపై సైక్రియార్టిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టైటిల్ మార్చడంతో పాటు ట్రైలర్‌ను సైతం వాయిదా వేశారు. ఏక్తా కపూర్, శ్రద్ధా కపూర్, శైలేష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కంగనాతో పాటు రాజ్‌కుమార్ రావు, విక్రాంత్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X