'మా' ఎన్నికలపై కోర్టు తీర్పు: కళ్యాణ్ పిటిషన్ కొట్టివేత, జరిమానా
హైదరాబాద్: మా ఎన్నికల ఫలితాల పైన సిటీ సివిల్ కోర్టు బుధవారం ఉదయం తీర్పు చెప్పింది. ఎన్నికల విషయంలో కేసు వేసిన ఓ కళ్యాణ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల ఫలితాలు విడుదల పైన రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని వెల్లడించింది. ఫలితాలు ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చునని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పిటిషనర్‌కు కోర్టు ఫైన్ వేసింది.

కాగా, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలపై సిటీ సివిల్ కోర్టులో వాదనలు సోమవారం ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికలు గత నెల చివరన పూర్తయినా కోర్టు కేసు కారణంగా ఫలితాలు ఈ రోజు వరకు వెలువడలేదు. ఇప్పుడు కోర్పు తీర్పు రావడంతో ఫలితాలు రావొచ్చు.
మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి
నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మురళీ మోహన్, అలీ కూడా కౌంటర్ దాఖలు చేసారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది.
(మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ వర్గం, జయసుధ వర్గం ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల తూటాలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ఈ నేపథ్యంలో ‘మా' అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











