చిన్న సినిమా అని లైట్ తీసుకుంటే... 200 కోట్లు వసూలు చేసింది

వరుణ్ ధావన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన జుడ్వా-2 చిత్రం అంచనాలకు అందని స్థాయిలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఈ సంవత్సరం మొత్తం బాలీవుడ్ నిరాశగానే ఉంది ఒకపక్క దక్షిణాది సినిమా బాలీవుడ్ రికార్డులమీద రికార్డులు కొట్టిపడేస్తే షారూఖ్, సల్మాన్ లాంటి స్టార్ల సినిమాలు మాత్రం ధారుణంగా చతికిల బడ్డాయి. ఈ సంవత్సరానికి జాలీ:ఎల్ ఎల్ బీ, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా తప్ప పెద్ద హిట్ అనేదే లేదు. ఈ రెండు సినిమాలూ అక్షయ్ కుమార్ వే. ఇవితప్ప ఇప్పటివరకు మంచి వసూళ్ళు తెచ్చి పెట్టిన సినిమాయేలేదు అనుకుంటున్న సమయం లో ఇంకో చిన్న సినిమా బాలీవుడ్ కి ప్రాణం పోసింది... అదే.. జుడ్వా-2.

Recommended Video

"Wearing Bikini Is Not A Crime..Please Understand" Tapsee Says
200 కోట్ల గ్రాస్

200 కోట్ల గ్రాస్

వరుణ్ ధావన్ లాంటి మీడియం రేంజ్ హీరో నటించిన ఈ చిత్రం అంచనాలకు అందని స్థాయిలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ కామెడీ మూవీ.. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో 'వరుణ్ ధావన్' హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.

జుడ్వా 2

జుడ్వా 2

తెలుగులో 'హాలో బ్రదర్' పేరిట సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 'సల్మాన్ ఖాన్' హీరోగా 'జుడ్వా' గా హిందీలో వచ్చింది. దీనికి సీక్వెల్ గా 'జుడ్వా 2' రూపొందింది.చాన్నాళ్లుగా సరైన సినిమా పడక నిరాశలో ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులు.. ఈ సినిమాను ఎగబడి చూశారు.

వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం

వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం

డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో 'వరుణ్ ధావన్' 'తాప్సీ'..జాక్వెలిన్ ఫెర్నాండెజ్' నటించారు. వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శలకు ప్రశంసలు అందుకుంది. తొలి రోజున దేశ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు

మూడు రోజుల్లోనే రూ. 50 కోట్లు సాధించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు రాబట్టినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. విదేశాల్లో రూ. 36.64 కోట్లు గ్రాస్ సాధించింది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలే బోల్తా కొడుతున్న సమయంలో వరుణ్ ధావన్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే. 90ల్లో ‘హలో బ్రదర్'కు రీమేక్‌గా వచ్చిన ‘జుడ్వా'కు ఇది రీమేక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X