twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదం: హీరోయిన్ ఫ్యామిలీకి షారుక్ ఖాన్ ఓదార్పు (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ మాజీ హీరోయిన్, ప్రముఖ నటి జుహీ చావ్లా సోదరుడు బాబీ చావ్లా (55) ఆదివారం మరణించారు. 2010 నుండి కోమాలోనే ఉన్న బాబీ ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం కన్నుమూసారు. అదే రోజు సాయంత్రం ముంబైలోని శ్మషాన వాటికలో బాబీ అంత్యక్రియలు జరిగాయి.

    బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్నసమాచారం ప్రకారం చాలా కాలం నుండి బాబీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 2010లో ఓ రెస్టారెంటులో డిన్నర్ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్‌కు గురైన బాబీ కోమాలోకి వెళ్లి పోయారు. అతన్ని మామూలు స్థితికి తెచ్చేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బాబీ కన్నమూసాడు.

    ముంబైలో జరిగిన బాబీ అంత్యక్రియలకు ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ హాజరయ్యారు. బాబీ పోయిన దు:ఖంలో ఉన్న జుహీ చావ్లా కుటుంబ సభ్యులను ఓదార్చారు.

    సోదరుడికి అంత్యక్రియల్లో జుహి చావ్లా

    సోదరుడికి అంత్యక్రియల్లో జుహి చావ్లా

    ముంబైలో జరిగిన తన సోదరుడు బాబీ అంత్య క్రియల్లో జుహి చావ్లా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    సెలబ్రిటీలు

    సెలబ్రిటీలు

    ఆదివారం సాయంత్రం జరిగిన బాబీ అంత్యక్రియల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో షారుక్ ఖాన్, ఫరా ఖాన్, దీపిక పదుకొనె, అనుభవ్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

    జుహి ఫ్యామిలీకి షారుక్ సంతాపం

    జుహి ఫ్యామిలీకి షారుక్ సంతాపం

    జుహి చావ్లా సోదరుడు బాబీ అంత్యక్రియల్లో పాల్గొన్న షారుక్ ఖాన్....వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఓదార్చారు.

    నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వాడు

    నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వాడు

    బాబీ చావ్లా ఎప్పుడూ అందరితో కలిసి పోయి నవ్వుతూ...నవ్విస్తూ ఉండే వాడు. ఆయన లేని లోటు తీరనిది. కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని పలువురు అభిప్రాయ పడ్డారు.

    జుహీ చావ్లాతో షారుక్

    జుహీ చావ్లాతో షారుక్

    బాబీ చావ్లా అంత్యక్రియల సందర్భంగా విషాదంలో మునిగి పోయిన జుహీ చావ్లాను ఓదారుస్తున్న షారుక్. మరో హీరో రితేష్ దేశ్ ముఖ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ....బాబీ చావ్లా నిజమైన జంటిల్మెన్ అని పేర్కొన్నారు.

    English summary
    Bobby, Actor Juhi Chawla's elder brother, passed away on last Sunday. The 55 year old Bobby, who was in a coma since 2010, was at Jaslok Hospital, Mumbai. He was cremated at Banganga Crematorium in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X