షారుఖ్ తీరుపై జుహీచావ్లా చిటపట
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పట్ల అతని బిజినెస్ పాట్నర్, మాజీ హీరోయిన్ జుహీ చావ్లా అసంతృప్తిగా ఉంది. కారణం జుహీ సోదరుడు బాబీ చాలా కాలంగా కోమాలో ఉన్నాడు. ఇన్నాళ్లు తన సోదరుడి గురించి కనీసం పట్టించుకోని షారుఖ్ ఇటీవల తెగ హడావుడి చేస్తుండటమే ఇందుకు కారణం. షారుఖ్ దగ్గరి స్నేహితుల్లో ఒకరైన బాబీ ఇది వరకు షారుఖ్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ కు సిఈఓగా పని చేశారు. అతను అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కోమాలోకి వెళ్లి పోయాడు.
సారుఖ్ నటించిన తాజా సినిమా రా.వన్ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా షారుఖ్ ఈ చిత్రం యొక్క సంగీతాన్ని బాబీకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇంతకాలానికి షారుఖ్ కు తన పాత స్నేహితుడు గుర్తొచ్చాడా? అంటూ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికైనా షారుఖ్ తన సోదరుడిని గుర్తు తెచ్చుకున్నందుకు కాస్త సంతోషంగానే ఉంది. మన అనే వాళ్లని, మన కోసం పని చేసే వారిని అవసరం అయిపోయాక మరిచి పోవడం మంచిది కాదనే విషయం షారుఖ్ ఇప్పటికైనా గ్రహించాలి అంటూ...చురకలు అంటించింది.


Click it and Unblock the Notifications











