డ్రగ్స్ పార్టిలో పట్టుబడ్డ టీవీ స్టార్స్

By Srikanya

జుహూలోని అజోక్ రూఫ్‌టాప్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌పార్టీలో పట్టుబడిన టీవీ స్టార్స్ అపూర్వ, శిల్ప అగ్నిహోత్రిలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ రేవ్‌పార్టీపై పోలీసులు చేసిన దాడిలో 100 మందిని అరెస్టు చేసారు. వీరిలో అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, ఐపీఎల్ క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.వారు తమకే పాపం తెలియదని,తాము సెలబ్రిటీలు అయినందునే పోలీసులు తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తమను కావాలనే అరెస్టు చేశారని ఆరోపించినా వారిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు.


వారంతా అది రేవ్ పార్టీ అనే విషయమే తమకు తెలియదన్నారు. తాము సాధరణంగానే హోటల్‌కు వెళ్లామని, అంతలోనే పోలీసులు వచ్చి అరెస్టు చేశారని చెప్పారు. పట్టుబడిన వారందరూ తాము ఏ తప్పు చేయలేదని చెబుతున్నా పోలీసులు మాత్రం అన్ని ఆధారాలతో కేసులు పెడుతున్నారు. ఘటనాస్థలంలో 110 గ్రాముల కొకైన్, చరస్, ఇతర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రేవ్‌పార్టీ నిర్వహించినవారిపై కేసులు నమోదు చే సిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇన్విటేషన్‌లోని పదాలను డీకోడ్ చేయడంపై ప్రధానంగా దృష్టిసారిం చారు. పార్టీ జరిగినరోజు మ్యూజిక్ ప్లే చేసిన డిస్క్ జాకీని స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశిం చారు. దీంతో డీజే బ్రదర్స్ రోమియో, దీపేశ్ శర్మలు స్టేషన్‌కు వెళ్లారు. వారి నంచి సేకరించిన వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఐదుగురి నుంచి వాంగ్మూలాన్ని సేకరించామన్నారు.

అయితే వారి పేర్లను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అయితే అతిథులను ఆహ్వానించేందుకు నిర్వాహకులు ఉపయోగించిన పదాలను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం వివిధ హోటళ్లలలో పార్టీలు నిర్వహించేవారినుంచి వివరాలు సేకరిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు. పార్టీకి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు నిర్వాహకులు 'హండాస్ ప్రొఫైల్' పేరుతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను కూడా ఉపయోగించుకున్నారని తెలిపారు.

ఈ సైట్‌లో 'సపోర్ట్ ద మ్యూజిక్ నాట్ ద డ్రగ్' అనే సందేశాన్ని పంపారని, అంతేకాక డిజైనర్ హ్యాపీస్, సన్‌డౌన్, లెట్స్ రాక్ దిస్ టౌన్-సో గెట్ రెడీ టు గెట్ హై.. ప్లీజ్ డు నాట్ ట్రై టు ఫ్లై అంటూ రకరకాల సందేశాలను పోస్ట్ చేశారని, నిజానికి వీటి అర్థాలు ఒకటైతే గూడార్థాలు మరొకలా ఉండేలా అవకాశముందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదాలను డీకోడ్ చేస్తే నిజమైన దోషుల వివరాలు బయటకు వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు హోట ల్‌పై దాడి చేశామని, అయితే అందులో ఉన్న వారిని చూసి ఒక్కసారిగా నివ్వెర పోయామన్నారు. బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులేకాకుండా జర్నలిస్టులు, సైంటిస్టులు కూడా ఉండడం తమని ఆశ్చర్యానికి గురిచే సిందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X