అల్లు అర్జున్ ‘జులాయి’ ఆడియో రిలీజ్ డేట్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'జులాయి' చిత్రం ఆడియో రిలీజ్ డేట్ దాదాపుగా ఖరారైంది. ఏప్రిల్ 27న ఈచిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పిటికే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలోనే సాంగుల షూటింగ్ ప్రారంభం కానుంది.
జులాయి చిత్రాన్ని డివివి దానయ్య సమర్పణలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అదిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ... కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని అంటున్నారు.
త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికి నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫారిన్‌లో పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరున ఆడియోను, మే నెలాఖరున సినిమాను విడుదల చేస్తామ అని తెలిపారు.
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సోనూసూద్, ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మాజి, రావు రమేష్, శ్రావణ్, తులసి, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ, నిర్మాణం: హారికా అండ్ హాసిని క్రియేషన్స్.


Click it and Unblock the Notifications











