తాజ్ బంజారాలో ‘జులాయి’ డబుల్ ప్లాటినమ్
హైదరాబాద్: అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' చిత్రం సూపర్ హిట్టవడం, ఆడియో కూడా భారీ విజయం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని తాజ్ బంజారాలో శుక్రవారం సాయంత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, వివి వినాయక్, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, దిల్ రాజు, బ్రహ్మానందం, దేవిశ్రీ ప్రసాద్, డివివి దానయ్య, ఎన్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ బన్నీకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన త్రివిక్రమ్‍కు థాంక్స్. త్రివిక్రమ్ డైరెక్షన్, డైలాగులు హైలెట్. బన్నీ చాలా కష్ట జీవి. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. దేవిశ్రీ మంచి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినిమా కమర్షియల్ హిట్ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు అందరం కష్టపడి పని చేశాము, అల్లు రామలింగయ్యగారి మీద ప్రేమను చూపించుకునే అదృష్టం బన్నీద్వారా లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ త్రివిక్రమ్ జీవితాన్ని కాచి వడగట్టాడు కాబట్టే అద్భుతమైన మాటలు రాయగలిగాడు. ఆయన దర్శకత్వం, డైలాగ్స్ షార్ప్ అండ్ సూపర్ అన్నారు.
తివిక్రమ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కథ వినకుండా మనమిద్దరం సినిమా చేద్దా అని నాకు సహకరించి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుని అద్భుతంగా నటించిన బన్నీకి, నన్ను ప్రోత్సహించిన నిర్మాతలకు థాంక్స్. నాకు నచ్చిన నటీనటులంతా ఇందులో నటించడం ఆనందంగా ఉందన్నారు. బన్నీ మాట్లాడుతూ ఈ సక్సెస్ కు ముఖ్య కారణం త్రివిక్రమ్ గారే. నేను ఇంత బాగా యాక్ట్ చేయడానికి కారణం కూడా ఆయనే. రాజేంద్రప్రసాద్ గారి వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించి నా నమ్మకం నిలబెట్టాడు. అ సినిమాను సక్సెస్ చేసి నా రేంజి పెంచిన అభిమానులకు డబుల్ థాంక్స్ అన్నారు.


Click it and Unblock the Notifications











