‘జులాయి’ 50 రోజులు పూర్తి...
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'జులాయి' చిత్రం నేటి(సెప్టెంబర్ 27, 2012)తో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దర్శకుడు బన్నీని ఈచిత్రంలో సరికొత్తగా ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది.
జులాయి మలయాళ వెర్షన్ 'గజ పోకిరి' ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేసారు. ఈ చిత్రం అక్కడ కోటి ఇరవై లక్షలుకు అమ్ముడైంది. ఆర్య 2, బద్రీనాధ్ చిత్రాలు కోటి రూపాయలు పైగా బిజినెస్ చేయటంతో ఈ క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ సీని కెరీర్లో 'జులాయి' చిత్రం ఓ మైలు రాయిగా మిగిలిందని చెప్పక తప్పదు.
ఈ చిత్రం తర్వాత బన్నీ-పూరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై 'ఇద్దరమ్మాయిలతో...'. పేరుతో గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దర్శకుడు పూరీ జగన్నాధ్ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరమ్మాయిలతో చిత్రానికి... సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











