రికార్డు స్థాయిలో ‘జులాయి’ ప్రీమియర్ షోలు
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'జులాయి' చిత్రం రేపు(ఆగస్టు 9)న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో రికార్డు స్థాయిలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శింప బడుతున్నాయి. అక్కడ విడుదలకు ఒక రోజు ముందే మొత్తం 51 సెంటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేస్తున్నారు. FICUS Inc సంస్థ ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది.
అదే విధంగా చెన్నయ్‌లో కూడా ఈ మూవీ భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ ప్రీమియర్ షోలు లేక పోయినా...ఆగస్టు 9న ఉదయం స్పెషల్ మార్నింగ్‌షో ఉదయం 8 గంటలకు కెపిహెచ్‌బి కాలనీలోని శివ పార్వతి థియేటర్లో వేస్తున్నారు.
ఈ చిత్రం మొత్తం 1600 స్క్రీన్లలో తెలుగు, మళయాళ భాషల్లో ఈ సినిమా ఒకే రోజు విడుదల కాబోతుండటం విశేషం. అల్లు అర్జున్, ఇలియానా హీరో హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, సోను సూద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈచిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











