షాకిస్తున్న ‘జులాయి’ థియేటర్ల ఫిగర్
అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జులాయి' చిత్రం వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఆగస్టు 9న విడుదల చేసేందుకు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నిర్మాతలు ఈ వాయిదాకు కారణం అత్యధికంగా థియేటర్లను చేజిక్కించుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టడేమే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కాబట్టి తప్పకుండా తగిన ఫలితాలను ఇస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
తాజాగా ప్రొడక్షన్ హౌస్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా ఈ రేంజిలో థియేటర్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలకే సాధ్యం. కానీ అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారిగా భారీ ఎత్తున ఈ చిత్రం విడుదలువుతోంది.
కె. రాధకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











