‘జులాయి’ మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం జులాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కె. రాధకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన విషయం తెలిసిందే. గతంలో బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 ఆడియో ఘన విజయం సాధించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
జులాయి విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ...ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు చాలా మంచి స్పందన లభిస్తోంది. అలాగే ఈ చిత్ర ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ గురించి ఆయన పెన్ పంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాజిటివ్ వైబ్రేషన్స్ వీస్తున్న జులాయి త్రివిక్రమ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే అన్ని అంశాలతో పాటు...బన్నీ కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలం' అని అన్నారు.
గత వారం రోజులుగా రామ్ చరణ్ పెళ్లి బిజీలో ఉన్న బన్నీ మళ్లీ జులాయి షూటింగులో నిమగ్నమయ్యాడు. మిగిలిన ఒక్క పాటను కంప్లీట్ చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో జులాయి చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శర వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే(జులై 6న?) విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











