దుబాయ్‌కి చెక్కేస్తున్న ‘జులాయి’
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్. రాధాకృష్ణ నిర్మాతగా ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'జులాయి' టాకీ పార్టుని ముగించుకుని పాటల చిత్రీకరణకి ఈ నెల 26న దుబాయ్ బయల్దేరుతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ...''స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బేనర్ పై తెరకెక్కిస్తున్న చిత్రం 'జులాయి' అనగానే అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ కాంబినేషన్ కి ఇది కరెక్ట్ టైటిల్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. బిజినెస్ వర్గాల్లో జులాయి చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ కి కంప్లీట్ చేసుకుని సాంగ్స్ చిత్రీకరణ కోసం ఈ నెల 26న దుబాయ్ బయల్దేరుతున్నారు. అక్కడే రెండు సాంగ్స్ చిత్రీకరణ చేసి తరువాత మరో రెండు సాంగ్స్ చిత్రీకరణ ఇండియాలో షూట్ చేస్తాము. దీంతో టోటల్ చిత్రం పూర్తవుతుంది. ఇలియానా హీరోయిన్‌గా చేస్తుంది.
అల్లు అర్జున్, ఇలియానా జోడి ఆన్ స్ర్కీన్ పై అలరిస్తుంది. వీరి జంట చూడ ముచ్చటగా ఉందని ఇప్పటికే స్టిల్స్ చూసిన ప్రముఖులు అంటున్నారు. చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అంత అద్భుతంగా మా దర్శకుడు త్రివిక్రమ్ తీర్చి దిద్దారు. అలాగే సంభాషణల విషయంలో చేయి తిరిగిన త్రివిక్రమ్ మరోసారి అలరిస్తారు. థియేటర్స్ లో విజిల్స్ పడేలా డైలాగ్స్ రాశారు. త్రివిక్రమ్ రాసిన సూపర్బ్ డైలాగ్స్ బన్నీ అంతే సూపర్ గా పలికాడు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క కేరక్టర్ కి ఓ పర్పస్ ఉంటుంది. హీరో హీరోయిన్స్ తరువాత అంతే ఇంపార్టెంట్ ఉన్న అతి కీలకమైన పాత్రలో నట కిరీటి డా. రాజేంద్రప్రసాద్ నటించారు.
జులాయి చిత్రానికి మరో హైలెట్ గా రాజేంద్ర ప్రసాద్ నటన ఉంటుందనేది ఏ మాత్రం సందేహం లేదు. ఏ సినిమాకైనా మ్యూజిక్ 50% ఎస్సెట్స్ అవుతుందంటారు. ఆ విషయంలో 100% న్యాయం చేయగల సత్తా ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మే చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
అల్లు అర్జున్, ఇలియానా, డా. రాజేంద్రప్రసాద్, సోనూసూద్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











