అల్లరి నరేష్ ‘జంప్ జిలానీ’ ఆడియో రిలీజ్ డేట్

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన వినోదాత్మక చిత్రం 'జంప్ జిలానీ' విడుదలకు సన్నద్ధమవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'కలగలపు' చిత్రం ఆధారంగా దీన్ని మలిచారు. ఇ.సత్తిబాబు దర్శకుడు నరేష్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్లుగా నటించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఈ నెల 31న సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కానుంది.

ఈ విషయాన్ని నిర్మాత అంబికా రాజా తెలియజేస్తూ, ఆడియో విడుదల కంటే ముందుగా బుధవారం ఓ పాటను విడుదల చేస్తున్నామని తెలిపారు. రామ జోగయ్యశాస్త్రి రచించగా, క్రిష్, గీతా మాధురి ఆలపించిన 'వెల్ కమ్ హార్టీ వెల్ కమ్ నువ్వే నా ప్రేమ లోకం' అనే వినసొంపైన పాటను డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఇంటర్నెట్, మొబైల్‌లలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

‘Jump Jilani’ gearing up to release in June

చిత్ర సమర్పకుడు అంబికా కృష్ణ మాట్లాడుతూ...బుధవారం విడుదల చేయబోతున్న 'వెల్ కమ్' పాట యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని, రింగ్ టోన్‌గా కూడా ఈ పాట పాపులర్ అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, జూన్ ప్రథమార్థంలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

దర్శకుడు ఇ. సత్తి బాబు మాట్లాడుతూ...నరేష్ కెరీర్‌లో ఇది ఓ మంచి చిత్రంగానూ, అతనికి ఓ మంచి పాత్రగా నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, రఘు బాబు, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, రావు రమేష్, వేణు మాధవ్, సన, హేమ, గీతా సింగ్, ఖయ్యూం తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి కథ: సుందర్ సి. మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: సతీష్ వేగేశ్న, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, సంగీతం: విజయ్ ఎంజెర్, ఛాయాగ్రహనం, దాశరథి శివేంద్ర, కళ: కిరణ్ కుమార్, ఎడిటింగ్: గౌతం రాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాంబాబు, నిర్మాత: అంబిక రాజా, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X