ఫోర్న్ స్టార్ కాదు: దర్శకుడిపై ఆమె కోర్టుకు
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, నర్గీస్ ఫక్రి జంటగా రూపొందిన 'రాక్ స్టార్" సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తో దూసుకెలుతున్న విషయం తెలసిందే. అయితే ఈ సినిమాపై కొత్త వివాదం నెలకొంది. ఇందులో నటి అషికా సూర్యవంశీని ఫోర్న్ యాక్టర్ గా చూపించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై సినిమా దర్శకుడు ఇంతియాజ్ అలీని, నిర్మాతలను కోర్టుకు ఈడ్చేందుకు సిద్ధం అవుతోంది.
రాక్ స్టార్ సినిమాలోని ఓ సీన్లో....రణబీర్ కపూర్, నర్గీస్ ఫక్రిలు అమర్ టాకీస్‌కు వెళ్లి ఓ సినిమా చూస్తారు. ఆ సినిమా పేరు 'జంగిల్ లవ్". ఇందులో ఇద్దరు కలిపి ఫోర్న్ సినిమాకు వెలుతున్నట్లు చూపిస్తారు. అంటే రాక్‌స్టార్ సినిమా దృష్టిలో జంగిల్ లవ్ అనే సినిమా సాఫ్ట్ ఫోర్న్ సినిమా అన్నమాట. దీంతో జంగిల్ లవ్ లో నటించిన ఆషికా అగ్గిమీద గగ్గిలం అవుతోంది. ఆ సినిమాను ఫోర్న్ సినిమా చూపించడం ద్వారా ఇండైరెక్టుగా తనను ఫోర్న్ స్టార్ గా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆషికా.


Click it and Unblock the Notifications











