వృభిచార గృహం నడిపిస్తున్న జూనియర్ ఆర్టిస్టు
వ్యభిచార గృహం నిర్వహిస్తూ ఓ జూనియర్ ఆర్టిస్టు పోలీసులకు దొరికిపోయింది. హైదరబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె చెరనుంచి ఇద్దరు యువతులను పోలీసులు రక్షించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీజీపీ సీ హెచ్ రామ్ చందర్ తెలిపిన వివరాలు ప్రకారం..రాజమండ్రికి చెందిన ఎం.సుజాత ఈస్ట్ మారేడ్ పల్లిలో నివసిస్తూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. ఆమెకు పదిహేనేళ్ల క్రితం పెళ్ళైంది. ఐదేళ్ల క్రితం భర్త మరణించారు. అనారోగ్యం వల్ల జూనియర్ ఆర్టిస్టుగా పనిచేయలేకపోతున్న సుజాత సులభంగా డబ్బు సంపాదించేందుకు హైదరాబాద్ తుకారామ్ గేటు పరిధిలో వ్యభిచార గృహం ఏర్పాటు చేసింది.
స్ధానిక యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. విటులను ఆహ్వానించి కమీషన్ వసూలు చేస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఎల్ .రాజా వెంకట రెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి సుజాతను అరెస్టు చేసింది. ఆమె చెరలో ఉన్న ఇద్దరు యువతులను రక్షించి కేసును తుకారామ్ గేటు పోలీసులకు అప్పచెప్పారు.


Click it and Unblock the Notifications











