చపాతీ చేయలేదని.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

By Srikanya

Junior artist ends life over tiff with wife
ఫిలింనగర్‌ : కోపం, క్షణికావేశం ఓ నిండు ప్రాణం తీసింది. చపాతీ చేసిపెట్టేందుకు భార్య ససేమిరా అనడంతో మనస్థాపానికి గురైన ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఉరేసుకుని చనిపోయాడు.

బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం... వరంగల్‌ టౌన్‌ రెడ్డికాలనీకి చెందిన డి.మోహన్‌రెడ్డి(32) నగరానికి వలసవచ్చి జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా చేరాడు. ఈ క్రమంలో సహచర ఆర్టిస్ట్‌ గీతను తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

ఇటీవల కాలంలో జూనియర్‌ ఆర్టిస్టులను షూటింగ్‌లకు సరఫరా చేసే సహ ఏజెంటుగా కూడా మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చీ రాగానే భార్యను చపాతీ చేయాలని కోరాడు. అందుకామె నిరాకరించి ఇంటి బయటకు వచ్చి కూర్చుంది.

ఎన్నిసార్లు అడిగినా ఆమె స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన మోహన్‌రెడ్డి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాసేపటి తర్వాత లోనికి వెళ్లి చూసిన భార్య జరిగిన ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై నయిముల్లా సంఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X