వ్యభిచారం కేసులో పట్టుబడ్డ మరో సినీతార
హైదరాబాద్: వ్యభిచారం కేసులో సినిమా రంగానకి చెందిన మరొకరు పట్టుబడ్డారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో సహా నలుగురు మహిళలను, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు.
డిసెంబర్ లాస్ట్ వీక్ నుండి నగరంలో వ్యభిచార కార్యకలాపాల జోరు పోరిగి పోయింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గత వారం పది రోజుల నుండి ఈ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టుతో సహా పట్టుబడిన మహిళలను రెస్క్యు హోంకి తరలించారు.

అయితే సినీ రంగానికి రెందిన ప్రముఖ హీరోయిన్లు సైతం ఇటీవల పట్టుబడిన సందర్భాలు అనేకం. పరిశ్రమలో అవకాశాలు లేక కొందరు, జల్సా జీవితానికి అలవాటు పడి మరికొందరు ఈ చీకటి దందా చేస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు కౌన్సింలింగ్ ఇచ్చినా ఇవి ఆగడం లేదు.
ఇలాంటి సంఘటనల్లో తరచూ హీరోయిన్లు పట్టుబడటం వల్ల సినీ పరిశ్రమ ప్రతిష్ట మసకబారుతోంది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినపుడు సినిమా పరిశ్రమతో ముడిపెట్ట కూడదని, ఇలాంటి వారి వ్యక్తిగత తప్పులు, ఒకరురిద్దరు చెడు మార్గంలో నడిచినంత మాత్రాన పరిశ్రమ మొత్తం తప్పుదారి పట్టినట్లు కాదని సినీపెద్దలు అంటున్నారు.


Click it and Unblock the Notifications