నటుడు బాలాజీ మోసం చేశాడంటూ.... శ్రీరెడ్డితో పాటు వెళ్లి ఫిర్యాదు చేసిన లక్ష్మి!
ఇండస్ట్రీల్లో దిక్కు మొక్కులేని జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న యాక్టర్స్‌కు ఇపుడు శ్రీరెడ్డి పెద్ద అండగా కనిపిస్తోంది. ఇంతకాలం తమకు అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియక, పోలీసులకు ఫిర్యాదు చేసే దైర్యం లేక మిన్నకుండి పోతున్న చాలా మంది శ్రీరెడ్డి సహాయం తీసుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి తనకు జరిగిన అన్యాయంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతిలేని పరిస్థితుల్లో కిడ్నీ అమ్ముకున్నా
సినీ నటుడు బాలాజీ తన భార్యకు కిడ్నీ ఇస్తే రూ. 20 లక్షలు ఇస్తానని నమ్మించాడని, భర్త పోయిన తర్వాత కుటుంబ భారం మోయలేక అప్పులపాలైన తాను...... గతి లేని పరిస్థితుల్లో కిడ్నీ అమ్ముకున్నానని జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి తెలిపారు.

రూ. 20 లక్షలు ఇవ్వకుండా మోసం
రూ. 20 లక్షలు ఇస్తానని చెప్పిన బాలాజీ.... కేవలం రూ. 3 లక్షలు మాత్రమే ఇచ్చి మోసం చేశాడని లక్ష్మి ఆరోపించారు. ఆసుపత్రిలో తెల్లకాగితాలపై సంతకం చేయించుకుని డబ్బు మొత్తం ముట్టినట్లు దబాయించి మోసం చేశాడని లక్ష్మి ఆరోపించారు.

మద్దతు పలికిన శ్రీరెడ్డి
జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మికి టాలీవుడ్ ఉద్యమకారిణి శ్రీరెడ్డి మద్దతుగా నిలిచారు. జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, మా అసోసియేషన్ లకు ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా శ్రీరె్డ్డి తెలిపారు. డబ్బు విషయంలో మాత్రమే కాదు, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని బాలాజీ మోసం చేశాడని, లక్ష్మికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని తెలిపారు.

టాలీవుడ్లో శ్రీరెడ్డి సంచలనం
సినిమా పరిశ్రమలో నాలుగైదు పెద్ద కుటుంబాలు, బడా నిర్మాతలదే ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా ఉండేదని, వారి అండ చూసుకుని క్రింది వారు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేసినా అడిగే వారు లేరు. శ్రీరెడ్డి వారందరినీ ఎదురించి టాలీవుడ్లో సంచలనం అయిందని, కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో ఇతర సమస్యపై ఆమె చేస్తున్న పోరాటం హర్షణీయమంటూ..... పలువురు మద్దతు ప్రకటించారు. పరిశ్రమలో అణచివేయబడ్డ వారంతా ఇపుడు శ్రీరెడ్డి పక్షాన చేరి ఆమె చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











