లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు.. లాడ్జిలకు రమ్మని నీచంగా!! జూనియర్ ఆర్టిస్ట్ సంచలనం
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల ఫలితంగా పలువురు నటీమణులు నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలను, లైంగిక వేధింపులకు బాహాటంగా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది ఓ జూనియర్ ఆర్టిస్ట్. వివరాల్లోకి పోతే..

మీడియా ముందుకు జూనియర్ ఆర్టిస్ట్ దివ్య
రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ (విన్నీ) తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ టాలీవుడ్ సైడ్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ దివ్య (19) మీడియా ముందుకొచ్చింది. అతడి ప్రేమను తిరస్కరించినందుకు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. లైంగిక వేధింపులు
అయితే ఈ వేధింపులు తట్టుకోలేక వెస్ట్‌మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ అక్కడి సీఐతో కుమ్మకై అంతా కలిసి తననే జైలుకు పంపారని సంచలన ఆరోపణలు చేసింది వరంగల్‌కి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ దివ్య. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా లైంగిక వేధింపులు ఆగడం లేదని పేర్కొంటూ ఓపెన్ అయింది దివ్య.

బ్రోతల్ కేసు.. లాడ్జిలకు రమ్మని నీచంగా
ఏసీపీ తనపై అన్యాయంగా బ్రోతల్ కేసు పెట్టి 21 రోజులు జైలుకు పంపారని, విచారణ పేరుతో లాడ్జిలకు రమ్మని నీచంగా మాట్లాడేవారంటూ దివ్య చెప్పింది. స్టేషన్‌కి పిలిచి తెల్లకాగితంపై బలవంతంగా సంతకం చేయించుకుని తనపై బ్రోతల్ కేసు పెట్టారని, గాంధీ హాస్పటల్‌కి తీసుకెళ్లి తప్పుడు పరీక్షలు జరిపించి జైలుకు పంపారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది దివ్య.

కేసీఆర్ కల్పించుకోవాలంటూ..
ఇక ఇప్పుడు వినోద్, అతని అనుచరులు ఎక్కడికి వెళ్లినా తనను వెంబడిస్తూ చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె తెలిపింది. వాళ్ళందరి చీకటి బాగోతం అంతా తెలుసు కాబట్టే తనని చంపాలని చూస్తున్నారని దివ్య చెప్పుకొచ్చింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కల్పించుకుని తనకు రక్షణ కల్పించాలని ఆ యువతి కోరింది.
Recommended Video


అవన్నీ తప్పుడు ఆరోపణలు.. ఏసీపీ
అయితే ఈ ఆరోపణలు చేస్తున్న దివ్యకు, లారెన్స్ తమ్ముడు వినోద్‌కి పాతగొడవలు ఉన్నాయని.. ఆమె పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ వివరణ ఇచ్చారు ఏసీపీ. చూడాలి మరి ఈ ఇష్యూపై లారెన్స్ ఎలా స్పందిస్తారో!.


Click it and Unblock the Notifications











