అర్థరాత్రి హైడ్రామా.. బన్నీవాసు మోసం చేశాడు.. పవన్ దృష్టికి రావాలంటూ లేడీ ఆర్టిస్ట్ ఆందోళన
Recommended Video
మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ సునీత హంగామా చేసింది. తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ ఆందోళనకు దిగింది. దీంతో ఫిలిం ఛాంబర్ వద్ద వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇంతకీ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఆరోపణలు ఏంటి? ఆమె ఎందుకు ఆందోళనకు దిగింది? వివరాల్లోకి పోతే..

నిర్మాత బన్నీవాసు మోసం చేశాడంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాత తనను మోసం చేశాడని పేర్కొంటూ తీవ్ర ఆందోళన చేసింది సునీత. రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్‌కి చేరుకున్న సునీత సదరు నిర్మాతపై ఆరోపణలు గుప్పించింది. దీంతో ఫిలిం ఛాంబర్ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి.
బందించుకొని.. నమ్మించి మోసం చేశాడంటూ
తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిలిం చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది సునీత. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన సదరు నిర్మాత తనను నమ్మించి మోసం చేశాడని సునీత ఆరోపణలు చేసింది. ఇది అడిగితే తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని నానా రచ్చ చేసింది.
ఆ నిర్మాత స్వయంగా వస్తేనే.. అరెస్ట్
తనను మోసం చేసిన ఆ నిర్మాత స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే తాను బయటకు వస్తానంటూ ఆమె నానా యాగీ చేయడంతో.. విషయం తెలుసుకున్నబంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఫిలిం చాంబర్ చేరుకున్న పోలీసులు బలవంతంగా సునీతను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకే..
తనకు జరిగిన అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలనే ఇలా నిరసనకు దిగానని చెప్పింది సునీత. దీనిపై అల్లు అరవింద్ కూడా వచ్చి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే తన పోరాటంతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది సునీత.

గతంలో కత్తి మహేష్‌పై కూడా
జూనియర్ ఆర్టిస్ట్ సునీత గతంలో కత్తి మహేష్‌పై కూడా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలు మీడియా సమావేశాల్లో పాల్గొని కత్తి మహేష్‌పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన ఆమె.. మళ్ళీ ఇలా ఓ నిర్మాతపై ఆరోపణలు గుప్పించడం అనుమానాలకు తావిస్తోంది.


Click it and Unblock the Notifications











