అభిమానిగా మారిన నాని.. సీనియర్‌ హోస్ట్‌తో సెల్ఫీల హంగామా!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Kamal Hassan Enters Into the Show

అశేష సినీ ప్రేక్షకాదరణ ఉన్న తారలు కూడా అప్పడప్పుడు అభిమానులుగా మారిపోతుంటారు. అందుకు సాక్ష్యంగా నాని కనిపించారు. తాను విపరీతంగా ఇష్టపడే హీరో ఎదుటపడితే మనుసులో ఉన్న అభిమానం పొంగుకొస్తుంది. నాని కళ్లలో అదే కనిపించింది. ఇది ఎక్కడ.. ఎప్పుడూ.. ఎలా జరిగిందంటే..

బిగ్‌బాస్ షోలో కమల్ హాసన్

బిగ్‌బాస్ షోలో కమల్ హాసన్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. తొలిసారి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఆకట్టుకొంటూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వరూపం ప్రమోషన్ కోసం విలక్షణ నటుడు కమల్ హాసన్‌ బిగ్‌బాస్ షోకు రావడం జరిగింది.

 ఫ్యాన్‌గా మారిపోయిన నాని

ఫ్యాన్‌గా మారిపోయిన నాని

బిగ్‌బాస్‌ షోకు వచ్చిన కమల్ హాసన్‌ను నాని సాదరంగా ఆహ్వానించారు. నటనకు నిలువెత్తుగా నిలిచిన కమల్ చూడగానే అభిమానిగా మారిపోయారు. తనతో ఫోటో దిగడానికి బిగ్‌బాస్ ముందే హడావిడి చేశాడు. సెల్ఫీలతో అదరగొట్టిన నాని కెమెరాలు బంధించాయి.

కమల్‌ హాసన్‌తో నాని సెల్పీలు

కమల్‌తో నాని పలురకాలా యాంగిల్స్‌లో సెల్ఫీలు దిగుతూ తన కెమెరాకు పనిచెప్పాడు. ఆ తర్వాత నాని తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్యాగ్ చేశాడు. ఓ అభిమాని తన ఫేవరేట్ యాక్టర్‌ను కలుసుకొన్నాడు. జూనియర్ హోస్ట్ మీట్స్ సీనియర్ హోస్ట్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది జరిగింది కలయా? నిజమా? అన్నట్టు ఫోజు పెట్టారు.

ఆగస్టు 10న విశ్వరూపం2

ఆగస్టు 10న విశ్వరూపం2

తమిళంలో బిగ్‌బాస్‌కు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ నటించిన విశ్వరూపం2 చిత్రం ఆగస్టు 10న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్ర ప్రమోషన్ ఇటీవల సల్మాన్ ఖాన్ షోలో నిర్వహించారు. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లో చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X