జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. అభిమానిని గట్టిగా తోసేసి.. స్వర్గీయ ఎన్టీఆర్‌కు నివాళి
నటరత్న, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ నేతలు తమ అభిమాన నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్‌లోని ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు శ్రద్దాంజలి ఘటించారు. అయితే ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో భారీగా తోపులాట జరిగింది. దాంతో ఎన్టీఆర్ సమాధి వద్ద భారీగా గందరగోళం నెలకొన్నది. ఈ సంఘటనలు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తీవ్ర మనస్తాపానికి, అసౌకర్యానికి, అసంతృప్తికి గురిచేశాయి. ఎన్టీఆర్ సమాధి వద్ద ఎన్టీఆర్‌కు ఎదురైన ఇబ్బందుల వివరాల్లోకి వెళితే..

తన తాతగారు తెలుగు ప్రజల అభిమానుల నాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించడానికి ఆదివారం ఉదయం ఎన్టీఆర్ మార్గ్‌కు జూనియర్ ఎన్టీఆర్ చేరుకొన్నారు. అప్పటికే అభిమానులు కిక్కిరిసి ఉండటంతో ఎన్టీఆర్ సమాధి వరకు చేరుకోవడం కష్టంగా మారింది. అప్పటికే కొందరు అభిమానులు సమాధి వద్ద తోసుకొంటూ ఎన్టీఆర్‌కు అడ్డుగా నిలిచారు. తనకు అడ్డుగా ఉన్న వారిని తోసుకొంటూ ముందుకు సాగారు. ఓ దశలో ఇద్దరు బొకేను ఎన్టీఆర్ సమాధిపై పెట్టడానికి తోసుకుంటుండగా.. వారిని పక్కకు తోసేసి ఎన్టీఆర్ ముందుకు సాగారు.

అభిమానులు అడ్డుగా ఉండగానే ఎడమ చేత్తో గులాబీ రెక్కలను తీసుకొని.. విసుగ్గా సమాధిపై పెట్టి మనస్పూర్తిగా నివాళులర్పించారు. అయితే తాతగారికి నివాళులర్పించే ప్రతీ క్షణంలో ఆయన ముఖంలో కోపం, అసంతృప్తి, అసౌకర్యం ముఖంలో కనిపించింది. రకరకాల ఇబ్బందుల వల్ల ఎన్టీఆర్ మొక్కుబడిగా తాతకు నివాళులర్పించినట్టు కనిపించింది.

అయితే ఎన్టీఆర్ మార్గ్‌కు జూనియర్ ఎన్టీఆర్ చేరుకోగానే అభిమానులు భారీగా కేరింతలు కొడుతూ ఆహ్వానించారు. ఎన్టీఆర్ జై అంటూ నినాదాలు చేశారు. అలాగే సీఎం సీఎం అంటూ గట్టిగా అరిచారు. అయితే అభిమానుల గోలను పట్టించుకోకుండా ఎన్టీఆర్ తన పనిని తాను ముగించుకొని అసంతృప్తిగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎన్టీఆర్ నివాళులర్పించే కార్యక్రమం రసాభాసగా మారింది.

స్వర్గీయ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు మంత్రి శ్రీనివాసయాదవ్, నటుడు రాజేంద్ర ప్రసాద్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తారకరత్న సతీమణి, ఆమె పిల్లలు తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











