అన్నపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. మీరు అంతకంటే ఎక్కువ!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్రదర్స్ అంటే ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. హీరోగా ఒకరి స్థాయి ఎంత పెరిగినా కూడా చాలా మంది తమ్ముడు తమ్ముడే.. అన్నయ్య అన్నయ్యే.. అనే విధంగా నడుచుకుంటూ ఉంటారు. ఇక నందమూరి వారిలో వ్యక్తిగత అభిప్రాయ బేధాలు ఉన్నాయని కామెంట్స్ వచ్చినప్పటికీ రామ్ బ్రదర్స్ మాత్రం చాలా ఆప్యాయంగా ఉంటారు.

బెస్ట్ బ్రదర్స్..
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎక్కువగా కళ్యాణ్ రామ్ తోనే ఉంటాడని అందరికి తెలిసిందే. హరికృష్ణ వారసులుగా ఈ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ తో టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు.

కళ్యాణ్ రామ్ బర్త్ డే..
ఇక నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అయ్యేలా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ గా తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

సోదరుడి కంటే ఎక్కువ..
మీరు నాకు ఒక సోదరుడి కంటే ఎక్కువ. మీరు నాకు ఒక మంచి స్నేహితుడు. అలాగే ఒక తత్వవేత్త. అలాగే కొన్నేళ్ల పాటు నన్ను గైడ్ చేస్తున్న వ్యక్తి. నేడు మీ పుట్టినరోజు సందర్భంగా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కళ్యాణ్ అన్నా అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అలాగే మీరు నిజంగా చాలా బెస్ట్ అని కూడా కామెంట్ చేశాడు.
Recommended Video

మల్టీస్టారర్ ఎప్పుడొస్తుందో..
సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన వారు మల్టీస్టారర్ సినిమాలు చేస్తే.. ఆ సినిమా ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కలిస్తే నటిస్తే బావుంటుందని వారి అభిమానులు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు. గతంలో మల్టీస్టారర్ కథల కోసం వెతుకుతున్నట్లు కళ్యాణ్ రామ్ కూడా చెప్పాడు. బాలయ్య కూడా మంచి కథ సెట్టయితే చేస్తానని అన్నాడు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











