జూనియర్ ఎన్టీఆర్‌కు భార్య చివాట్లు.. చెడాపెడా తిట్టేసిన లక్ష్మీప్రణతి!

వెండితెర మీద ఎంత మంది విలన్లు అవలీలగా చిత్తు చేసినా.. ఇంటికి వస్తే ఇల్లాలికి తలవొగ్గాల్సిందే. ఇంట్లో భార్య మాటే వేదంగా భావిస్తారు ఎవరైనా. ఇందతా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ దంపతుల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘట

By Rajababu

వెండితెర మీద ఎంత మంది విలన్లు అవలీలగా చిత్తు చేసినా.. ఇంటికి వస్తే ఇల్లాలికి తలవొగ్గాల్సిందే. ఇంట్లో భార్య మాటే వేదంగా భావిస్తారు ఎవరైనా. ఇందతా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ దంపతుల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సినిమాలో ఎవరైనా శాసించే ఎన్టీఆర్‌పై భార్య ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఇటీవల మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ సరదాగా చెప్పినట్టు సమాచారం.

తలకు గాయం..

తలకు గాయం..

జూనియర్ ఎన్టీఆర్‌కు తన కుమారుడంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇటీవల తన కొడుకుకు నందమూరి అభయ్ రామ్‌కు స్నానం చేయిస్తుండగా జారి కిందపడటంతో తలకు గాయమైందట. దాంతో రెండు రోజులపాటు హాస్పిటల్‌కు తిరగాల్సి వచ్చింది. అజాగ్రత్తగా వ్యవహరించి కొడుకు దెబ్బ తగలడానికి కారణమైన భర్త ఎన్టీఆర్‌ను లక్ష్మీ ప్రణతి కొపగించుకొందట.

ఎమోషన్స్, ఫీలింగ్స్

ఎమోషన్స్, ఫీలింగ్స్

అల్లారుముద్దుగా చూసుకొనే తన కుమారుడికి గాయం కావడంతో చాలా బాధపడిందట. ఆ తర్వాత యంగ్ టైగర్ సర్ధిచెప్పడంతో శాంతించిందట. ఈ సంఘటన ప్రముఖుల ఇళ్లలో సాధారణ దంపతుల మధ్య ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయనేది అర్థమైంది.

కొడుకు అంటే ప్రేమ..

కొడుకు అంటే ప్రేమ..

పలు సందర్భాల్లో తన కొడుకుపైన ఉండే ప్రేమను జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. తన ఆలోచనా తీరులో కూడా మార్పులు వచ్చాయి అని జూనియర్ ఇటీవల ఓ వేడుకలో చెప్పారు.

ఎక్కువగా కొడుకుతోనే..

ఎక్కువగా కొడుకుతోనే..

షూటింగ్ లేని సమయంలో ఎక్కువ సమయాన్ని తన కుమారుడితోనే జూనియర్ గడుపుతుంటాడు. స్నానం చేయించడం లాంటివి కూడా స్వయంగా తనే చేస్తాడట. ఇటీవల ఓ రోజు కుమారుడు స్నానం చేయిస్తుండగా కిందపడి గాయం కావడంతో యంగ్ టైగర్‌ను లక్ష్మీప్రణతి చెడాపెడా తిట్టడం మీడియాలో చర్చనీయాంశమైంది.

 జై లవకుశలో..

జై లవకుశలో..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తొలిసారి ఈ సినిమాలో జూనియర్ త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను యంగ్ టైగర్ జన్మదినం రోజున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X